అదేంటి.. మ‌హేశ్ లుక్ మారింది..?

Last Updated on by

కొన్ని రోజులుగా మ‌హేశ్ కొత్త లుక్ లో క‌నిపిస్తున్నాడు. అల‌వాటు లేని గ‌డ్డం మీసాల‌తో మారిపోయాడు ఈ హీరో. అయితే ఇప్పుడు ఆ లుక్ పోయి పాత లుక్ లోకి వ‌చ్చేసాడు మ‌హేశ్ బాబు. తాజాగా కూక‌ట్ ప‌ల్లిలోని చెన్నై సిల్క్స్ ఓపెనింగ్ కు వ‌చ్చిన మ‌హేశ్ ను చూసి అంతా షాక్ అయ్యారు. పూర్తిగా క్లీన్ షేవ్ లోకి వ‌చ్చేసాడు మ‌హేశ్ బాబు. వంశీ పైడిప‌ల్లి సినిమా కోసం లుక్ మార్చిన ఈ సూప‌ర్ స్టార్.. ఇప్పుడు షెడ్యూల్ అయిపోవ‌డంతో మ‌ళ్లీ పాత లుక్ లోకి వ‌చ్చాడు. దీన్నిబ‌ట్టి రెండో షెడ్యూల్ కు ఇంకా చాలా టైమ్ ఉంద‌ని అర్థ‌మ‌వుతుంది. అల్ల‌రి న‌రేష్ కూడా ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

మొన్న‌టి వ‌ర‌కు ఈ చిత్ర షూటింగ్ డెహ్రాడూన్ లో జ‌రిగింది. అక్క‌డే నెల రోజుల పాటు నాన్ స్టాప్ షెడ్యూల్ పూర్తి చేసాడు వంశీ. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీద‌త్ నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. పూజాహెగ్డే హీరోయిన్. డెహ్రాడూన్ లో కాలేజ్ సీన్స్ అన్నీ చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు వంశీ. న‌రేష్ ఇంకా ఈ సెట్ లో అడుగు పెట్ట‌లేదు. రైతుల స‌మ‌స్యల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంద‌ని తెలుస్తుంది. ఇందులో విదేశాల నుంచి వ‌చ్చిన కంపెనీ సీఈఓగా న‌టిస్తున్నాడు మ‌హేశ్ బాబు. కొత్త షెడ్యూల్ మొద‌ల‌య్యే లోపు మ‌ళ్లీ సినిమాల లుక్ లోకి రానున్నాడు మ‌హేశ్ బాబు.

User Comments