మ‌హేశ్ ఆ రికార్డ్ కూడా దాటేసాడు..

తెలుగు ఇండ‌స్ట్రీలో ఎంత‌మంది హీరోలైనా ఉండ‌ని.. సోష‌ల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ఈయ‌నే ట్రెండింగ్. అస‌లు తెలుగు సినిమాకు ట్విట్ట‌ర్ అప్ డేట్స్ నేర్పించిందే మ‌హేశ్ బాబు. అలాంట‌ప్పుడు ఈయ‌న‌కు కాకుండా రికార్డులు మ‌రో హీరోకు ఎలా వ‌స్తాయి..? ఇప్పుడు ఇదే జ‌రిగింది. మ‌హేశ్ బాబుకు ట్విట్ట‌ర్ లో 5 మిలియ‌న్ ఫాలోయ‌ర్స్ వచ్చేసారు. ద‌క్షిణాది ఇండ‌స్ట్రీలో ఇంత మంది ఫాలోయ‌ర్స్ ఉన్న ఏకైక హీరో మ‌హేశ్ బాబు. ర‌జినీకాంత్ లాంటి హీరోకు కూడా సాధ్యం కాని రికార్డ్ ఇది.

త‌న ప్ర‌తీ చిన్న విష‌యాన్ని కూడా అభిమానుల‌తో షేర్ చేసుకోవ‌డం మ‌హేశ్ కు ఉన్న అల‌వాటు. ఇదే అత‌న్ని అభిమానుల‌కు మ‌రింత చేరువ చేసింది. ఇప్పుడు 50 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ వ‌చ్చేలా చేసింది. 2014 న‌వంబ‌ర్ లో తొలి మిలియ‌న్ మార్క్ అందుకున్న మ‌హేశ్.. 2016 ఏప్రిల్ లో రెండు మిలియ‌న్.. 2017 మార్చ్ లో మూడు మిలియ‌న్.. సెప్టెంబ‌ర్ లో 4 మిలియ‌న్.. డిసెంబ‌ర్ లో 5 మిలియ‌న్ మార్క్ అందుకున్నాడు మ‌హేశ్. అంటే ఏడాదిలోనే మ‌హేశ్ ఫాలోయ‌ర్స్ 30 ల‌క్ష‌ల మంది పెరిగార‌న్న‌మాట‌. ఇది కూడా ఓ రికార్డే. ఎంతైనా సోష‌ల్ మీడియాలో సూప‌ర్ స్టార్ ను కొట్టేవారే లేర‌బ్బా..!

User Comments