షిరిడీ నుంచి ముంబై ఛ‌లో

Last Updated on by

మ‌హేష్ ప్ర‌స్తుతం `మ‌హ‌ర్షి` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈలోగానే వైఫ్ న‌మ్ర‌త కిడ్స్ సితార‌, గౌత‌మ్ ల‌తో క‌లిసి షిరిడీ విజిట్ కి వెళ్లారు. అట్నుంచి అటే ముంబైకి వెళ్లి కుటుంబ సభ్యుల్ని క‌లిశారు. ఇటీవ‌లే కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం మ‌హేష్ ఫ్యామిలీ దుబాయ్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. తాజాగా న‌మ్ర‌త శిరోద్క‌ర్ షిరిడీకి భ‌క్తి టూర్ వెళ్లారు. న‌మ్ర‌త – సితార‌- గౌత‌మ్ బృందం ముంబై విమానాశ్ర‌యంలో ప్ర‌త్య‌క్ష‌మయ్యారు. షిరిడీ నుంచి నేరుగా ముంబైకి ప‌య‌న‌మై, అక్క‌డ కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రుల‌తో సెల‌బ్రేట్ చేశార‌ట‌. ముంబైలో బంధుమిత్రుల‌తో క‌లిసి దిగిన కొన్ని ఫోటోల్ని న‌మ్ర‌త ఇన్ స్టాగ్ర‌మ్ లో షేర్ చేశారు.

మ‌హేష్ న‌టిస్తున్న మ‌హ‌ర్షి చిత్రం స‌మ్మ‌ర్ లో రిలీజ‌వుతోంది. త‌దుప‌రి సుకుమార్ తో ఓ సినిమా అనీల్ రావిపూడితో వేరొక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. సుకుమార్ ఇప్ప‌టికే క‌థ రెడీ చేసి వినిపించేందుకు రెడీగా ఉన్నారు.

User Comments