భ‌ర‌త్ ను 200 కోట్లు దాటిస్తారా..?

Last Updated on by

అదేంటి.. దాటిస్తారా ఏంటి.. దాటాలి కానీ అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను విష‌యంలో మాత్రం ఇదే జ‌రుగుతుంది. అక్క‌డ అది దాట‌క‌పోయినా నిర్మాత‌లే దాటించేలా క‌నిపిస్తున్నారు. ఈ చిత్రం తొలి వారంలోనే 161 కోట్లు వ‌సూలు చేసిందంటూ నిర్మాత అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసాడు. దాన‌య్య చేసిన ఈ ప‌నికి మ‌హేష్ అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఒరిజిన‌ల్ గా వ‌చ్చిన క‌లెక్ష‌న్లు వేస్తే పోయేదేం ఉంది.. ఈ చిత్రానికి వ‌సూళ్లు బాగానే వ‌చ్చాయి క‌దా అంటూ విమ‌ర్శిస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ అంటూ ప్ర‌చారం చేస్తున్నాడు నిర్మాత‌. అయితే ఇక్క‌డ సీన్ మాత్రం మ‌రోలా ఉంది. సినిమాను అమ్మింది 100 కోట్ల‌కు.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చింది 80 కోట్లు. అంటే ఇంకో 20 కోట్లు రావాలి. అది రాక‌పోతే లెక్క‌ల ప్ర‌కారం చూస్తే భ‌ర‌త్ ఫ్లాప్ లిస్ట్ లోకి వ‌స్తుంది.

మ‌రోవైపు మే 4న నా పేరు సూర్య వ‌స్తుంది. అది వ‌చ్చిన త‌ర్వాత ఖచ్చితంగా భ‌ర‌త్ అనే నేను వ‌సూళ్ల‌పై ప్ర‌భావం ప‌డ‌క త‌ప్ప‌దు. ఇన్ని ఇలా ఉంటే ఈ సినిమా 200 కోట్ల క్ల‌బ్ లో చేర‌డం ఖాయ‌మంటూ నిర్మాత చెబుతున్నాడు. ఆయ‌న తీరు చూస్తుంటే అది దాట‌క‌పోయినా.. దాటించేలా క‌నిపిస్తున్నార‌ని సెటైర్లు పేలుతున్నాయి. 161 కోట్ల లెక్క‌లే ఇప్ప‌టి వ‌ర‌కు తేల‌లేదు.. ఇక 200 కోట్లు కానీ పోస్ట‌ర్ ప‌డితే న‌వ్వుకోవ‌డం మాత్రం ఖాయం. ఎందుకంటే అంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన రంగ‌స్థ‌లం కూడా ఇప్ప‌టి వ‌ర‌కు 200 కోట్ల క్ల‌బ్ లో చేర‌లేదు. ఇప్ప‌టికీ 190 కోట్లల్లోనే ఉంది ఈ చిత్రం. మ‌రోవైపు నిన్న‌గాక మొన్నొచ్చిన భ‌ర‌త్ అనే నేను మాత్రం 200 కోట్ల వైపు ప‌రుగు తీస్తుంద‌న‌డం మాత్రం నిజంగా విడ్డూర‌మే.

User Comments