రిలీజ్ వార్‌లో మ‌హేష్ వెన‌క్కి త‌గ్గాడా?

Sarileru Nekevvaru - File Photo

సంక్రాంతి వార్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ వెన‌క్కి త‌గ్గాడా? అంటే అవున‌నే ప్ర‌చారం సాగుతోంది. మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న స‌రిలేరు నీకెవ్వ‌రు- బ‌న్నీ హీరోగా న‌టిస్తోన్న అల వైకుంఠ‌పుర‌ములో జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.  ఇద్ద‌రు అగ్ర హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ పోరుకు రెడీ అవ్వ‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్ల‌లో ఆందోళ‌న నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఎవ‌రో ఒక‌రు వెన‌క్కి త‌గ్గితేగానీ  వార్ చ‌ల్లార‌ద‌ని భావించారు. ఓపెనింగులతో పాటు రెవెన్యూ షేరింగ్ స‌మ‌స్య తొల‌గాలంటే రిలీజ్ మ‌ధ్య గ్యాప్ త‌ప్ప‌నిస‌రి అని పంపిణీవ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

ఇదే స‌మ‌యంలో ఎట్టిప‌రిస్థితుల్లో అదే  తేదీకి సినిమా రిలీజ్ అవ్వాల్సిందేన‌ని మ‌హేష్ ప‌ట్టుబ‌ట్టిన‌ట్లు ప్ర‌చారం సాగింది. అటు బ‌న్నీ కూడా ప‌ట్టు విడుపు లేకుండా ఉన్నాడ‌ని వినిపించింది. అయితే తాజాగా అందుతోన్న స‌మాచారం మేర‌కు మహేష్ వెన‌క్కి తగ్గిన‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. ఒక్క‌రోజు ముందుగా అంటే జ‌న‌వ‌రి 11వ తేదీన రిలీజ్ చేద్దామ‌ని మ‌హేష్ ఆలోచ‌న చేస్తున్నట్లు వినిపిస్తోంది. అదే నిజ‌మైతే ఇద్ద‌రి హీరోల మ‌ధ్య క్లాష్  త‌ప్పిన‌ట్లే. సంక్రాంతి బ‌రిలో రిలీజ్ లు ఆరోగ్య‌క‌ర‌ వాతావ‌ర‌ణంలో జ‌ర‌గ‌నున్నాయ‌ని భావించ‌వ‌చ్చు. ఇక మ‌హేష్, బ‌న్ని మ‌ధ్య రిలీజ్‌ పంచాయితీకి చిరు దృష్టికి చేరింద‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. అయితే అందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.