భ‌ర‌త్ అప్పుడే 100 కోట్లా..?

Last Updated on by

దేవుడా.. ఇప్పుడు తెలుగు సినిమాలు కూడా బాలీవుడ్ ను బీట్ చేస్తున్నాయి. ఒక‌ప్పుడు రెండు మూడు రోజుల్లో 100 కోట్ల పోస్ట‌ర్లు కేవ‌లం బాలీవుడ్ లోనే క‌నిపించేవి. ఇప్పుడు టాలీవుడ్ లోనూ అవి వ‌స్తున్నాయి. బాహుబ‌లిని ప‌క్క‌న‌బెడితే ఖైదీ 5 రోజుల్లో.. రంగ‌స్థ‌లం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల మార్క్ అందుకున్నాయి. ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను ఏకంగా మూడు రోజుల్లోనే 100 కోట్ల మార్క్ అందుకుంది. తొలి రెండు రోజుల్లో 80 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసిన ఈ చిత్రం మూడో రోజు 100 కోట్ల జాబితాలో చేర‌డం ఖాయ‌మైపోయింది.

దాంతో నిర్మాత‌లు కూడా అఫీషియ‌ల్ గా పోస్ట‌ర్ విడుద‌ల చేసారు. ఫ‌స్ట్ డే 55 కోట్ల గ్రాస్ తో తెలుగులో బాహుబ‌లి, అజ్ఞాత‌వాసి త‌ర్వాత స్థానంలో నిలిచాడు భ‌ర‌త్. ఇప్పుడు మూడు రోజుల్లోనే 100 కోట్లు వ‌సూలు చేసి.. బాహుబ‌లి త‌ర్వాత స్థానంలో నిల‌బ‌డ్డాడు. జోరు చూస్తుంటే ఫుల్ ర‌న్ లో ఈజీగా చాలా రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేలా ఉన్నాడు ఈ హీరో. పైగా ఓవ‌ర్సీస్ లో అయితే రెండు రోజుల్లోనే 1.9 మిలియ‌న్ వ‌సూలు చేసి.. వీకెండ్ స‌మ‌యానికి 2.5 మిలియ‌న్ కు చేరుకునేలా ఉన్నాడు భ‌ర‌త్. మొత్తానికి బ్ర‌హ్మోత్స‌వం.. స్పైడ‌ర్ లాంటి డిజాస్ట‌ర్స్ త‌ర్వాత మ‌హేష్ కు రికార్డ్ బ్రేకింగ్ హిట్ వ‌చ్చింది. దాంతో అటు ఫ్యాన్స్.. ఇటు సూప‌ర్ స్టార్ పండ‌గ చేసుకుంటున్నారు.

User Comments