అసెంబ్లీలో భ‌ర‌త్ హైలైట్స్

Last Updated on by

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో రంగ‌స్థ‌లం ఇప్ప‌టికే వ‌చ్చేసింది. అంచ‌నాలు నిల‌బెట్టుకుంది. ఇక ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను రాబోతుంది. ఈ చిత్రం ఏప్రిల్ 20న విడుద‌ల కానుంది. తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సెన్సార్ స‌భ్యులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతూ ముఖ్య‌మంత్రి ఎలా ఉంటే బాగుంటుంది అనే అంశాన్ని సున్నితంగా.. సందేశాత్మ‌కంగా చెప్ప‌డంలో కొర‌టాల స‌ఫ‌లం అయ్యాడ‌నే అంటున్నారంతా. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పుకుంటే సెకండాఫ్ లో వ‌చ్చే 20 నిమిషాల సీక్వెన్స్ ఒక‌టి అరాచ‌కంగా ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. మ‌హేష్ అసెంబ్లీలో మాట్లాడే ఈ సీన్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంద‌ని.. తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్ లో ఒక‌టిగా ఇది నిలిచిపోతుంద‌ని న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

కొర‌టాల శివకు కూడా ప్ర‌తీ సినిమాలో ఇలాంటి ఓ సీక్వెన్స్ రాసుకోవ‌డం అల‌వాటు. మిర్చిలో రోడ్డుమీద ఫైట్ సీన్.. శ్రీ‌మంతుడులో ఫ్లాష్ బ్యాక్.. జ‌న‌తా గ్యారేజ్ లో రాజీవ్ క‌న‌కాల ఎపిసోడ్.. ఇలా ఒక్కో సీక్వెన్స్ కు ప్రాణం పోస్తుంటాడు. ఇప్పుడు భ‌ర‌త్ అనే నేనులోనూ ఇలాంటి ఓ సీక్వెన్స్ సినిమాను మ‌రో రేంజ్ కు తీసుకెళ్తుంద‌ని న‌మ్ముతున్నారు చిత్ర‌యూనిట్. మ‌రి చూడాలిక‌.. ఆ 20 నిమిషాల్లో మ‌హేష్ చేసిన అరాచ‌కం ఎలా ఉండ‌బోతుందో..?

User Comments