అంతా క‌లిసి మ‌హేశ్ ను బ‌లి చేస్తున్నారా..?

అదేంటి.. మ‌హేశ్ ను బ‌లి చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఉన్న పరిస్తుతులను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. మ‌హేశ్ ను అమాయ‌కున్ని చేసి ఆడుకుంటున్నారు. ఆయ‌న మంచి త‌నాన్ని ఇత‌ర హీరోలు చేత‌కాని త‌నంగా తీసుకుంటున్నారేమో అనిపిస్తుందిప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే. సినిమాలు హిట్ అయి నిర్మాతలకి లాభాలు రావాలి అని మహేష్ ఎప్పుడూ కోరుకొంటాడు. ఈయ‌న న‌టిస్తోన్న భ‌ర‌త్ అనే నేను ఏప్రిల్ 27న విడుద‌ల కానుంది. దీనికి త‌గ్గ‌ట్లే షూటింగ్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. ఇప్ప‌టికే ఏప్రిల్ 27న మ‌హేశ్ కు పోటీగా బ‌న్నీ వ‌స్తున్నాడు. ఈయ‌న న‌టిస్తోన్న నా పేరు సూర్య అదే రోజు విడుద‌ల కానుంది. ఇక ఇప్పుడు వీళ్లు చాల‌ర‌న్న‌ట్లు ర‌జినీకాంత్ కూడా ఏప్రిల్ 27 అంటున్నాడు.

ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప‌క్క సినిమా కోసం త‌న సినిమాల‌ను వాయిదా వేసుకుంటాడు మ‌హేశ్. ఎవ‌రూ న‌ష్ట‌పోకూడ‌ద‌ని త‌న సినిమాల‌నే త్యాగం చేస్తుంటాడు సూప‌ర్ స్టార్. రెండేళ్ల కింద బాహుబ‌లి కోసం శ్రీ‌మంతుడిని వాయిదా వేసాడు. త‌ద్వారా ఇద్ద‌రూ లాభ‌ప‌డ్డారు. ఇక ఇప్పుడు 2.0 ఏప్రిల్ 27న వ‌స్తుంది. ప‌రిస్థితి చూస్తుంటే భ‌ర‌త్ అనే నేనుకి మ‌రోసారి పోస్ట్ పోన్ త‌ప్పేలా లేదు. పైగా ర‌జినీతో పోటీ ప‌డ‌టం మ‌హేశ్ సినిమాకు అంత మంచిది కూడా కాదేమో..? ఏడేళ్ల కింద రోబో దెబ్బ‌కు ఖ‌లేజాకు చుక్క‌లు క‌నిపించాయి. ఇప్పుడు మ‌రోసారి ఈ ఇద్ద‌రూ పోటీ ప‌డ‌టం ఎవ‌రికీ మంచిది కాదు. అందుకే మ‌రోసారి మ‌హేశ్ కు త్యాగం త‌ప్పేలా లేదు.

User Comments