మహేష్ అన్నంత ప‌ని చేసాడుగా..

Last Updated on by

అంత‌గా మహేష్ ఏం చేసాడు అనుకుంటున్నారా..? ఈయ‌న భ‌ర‌త్ అనే నేను సినిమాను మొద‌లుపెట్టిన త‌ర్వాత చాలాసార్లు బ్రేక్ తీసుకున్నాడు. ఎప్పుడో పూర్త‌వ్వాల్సిన సినిమా ఇంకా పూర్తి కాలేదు. అయితే న్యూ ఇయ‌ర్ త‌ర్వాత కొర‌టాల శివ‌కు మహేష్ మాటిచ్చాడు. ఈ చిత్రం పూర్తయ్యాకే బ్రేక్ తీసుకుంటాన‌ని.. ఇప్పుడు ఇదే చేసాడు. జ‌న‌వ‌రి 7 నుంచి హైద‌రాబాద్ లోనే భ‌ర‌త్ అనే నేను షూటింగ్ జ‌రుగుతుంది. మ‌ధ్య‌లో రెండు మూడు రోజుల క్యాజువ‌ల్ బ్రేక్ త‌ప్ప షెడ్యూల్ కు ఎక్క‌డా బ్రేక్ ఇవ్వ‌లేదు మహేష్. నెల రోజుల నుంచి ఇక్క‌డే భారీ షెడ్యూల్ పూర్తి చేస్తున్నాడు శివ కొర‌టాల‌. మహేష్ తో పాటు కైరాఅద్వాని కూడా షూటింగ్ లో పాల్గొంటుంది. అంతేకాదు.. ఇప్పుడు క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా పూర్తైపోయింది. ప‌బ్లిక్ ప్లేస్ లోనే జ‌రిగే ఫైట్ సీక్రెన్స్ తో క్లైమాక్స్ పోర్ష‌న్ పూర్త‌యింది.
ఫిబ్ర‌వ‌రి 8 వ‌ర‌కు మిగిలిన బ్యాలెన్స్ కూడా పూర్తి చేయ‌నున్నాడు కొర‌టాల‌. ఇది పూర్తి అయిపోతే భ‌ర‌త్ అనే నేను షూటింగ్ అయిపోయిన‌ట్లే. ఏప్రిల్ 27న అనుకున్న‌ట్లుగానే భ‌ర‌త్ అనే నేను విడుద‌ల కానుంది. పైగా ఫిబ్ర‌వ‌రి నుంచే వంశీ పైడిప‌ల్లితో మహేష్ సినిమా మొద‌లు పెట్టాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ కు పోస్ట్ పోన్ అయింది. క‌థ విష‌యంలో మ‌రోసారి వంశీని కూర్చోమ‌ని ఆదేశించాడు మహేష్. దిల్ రాజు, అశ్వినీద‌త్ ఈ చిత్రానికి నిర్మాత‌లు. ఒక్కో సినిమాలో ఒక్కో సందేశం ఇస్తూ వ‌స్తోన్న కొర‌టాల‌.. భ‌ర‌త్ అనే నేనులో విద్యావ్య‌వస్థ గురించి డిస్క‌స్ చేయ‌బోతున్నాడు. ఇందులోని స‌మ‌స్య‌ల‌ను సున్నితంగా ఎత్తి చూపిస్తూనే.. దానికి పరిష్కార మార్గాలు కూడా చూపించ‌బోతున్నాడు కొర‌టాల శివ‌. మ‌రి.. భ‌ర‌త్ ఎలా ఉండ‌బోతున్నాడో.. ముఖ్య‌మంత్రిగా ఆయ‌న ఇచ్చే స‌ల‌హాలు ఎలా ఉండ‌బోతున్నాయో..?

User Comments