పాడుబ‌డ్డ థియేట‌ర్ లో మ‌హేష్ సినిమా

Last Updated on by

అవును.. మ‌హేష్ ఇప్పుడు పాడుబ‌డ్డ థియేట‌ర్ లో తిరుగుతున్నాడు. అంత అవ‌స‌రం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర క్లైమాక్స్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం ల‌క్డీకపూర్ ద‌గ్గ‌ర ఉన్న అమ‌రావ‌తి థియేట‌ర్ ఏరియాలో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. ఈ థియేట‌ర్ మూత‌ప‌డి కూడా చాలా ఏళ్ల‌వుతుంది. చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఈ థియేట‌ర్ కు ఇప్పుడు పండ‌గ క‌ళ వ‌చ్చింది. మ‌హేష్ రావ‌డంతో అక్క‌డ అభిమానుల సంద‌డి ఎక్కువైంది. మ‌రికొన్ని రోజులు అదే ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జ‌ర‌గ‌నుంది.

మ‌హేష్ తో పాటు హీరోయిన్ కైరా అద్వాని కూడా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటుంది. మార్చ్ 8 లోపు షూటింగ్ పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు కొర‌టాల శివ‌. దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 26న విడుద‌ల కానుంది. పొలిటిక‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో మ‌హేష్ బాబు ముఖ్య‌మంత్రిగా న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం రాజ‌కీయాలు ఎలా ఉన్నాయనే విష‌యంపై కొర‌టాల చాలా సెటైరిక‌ల్ గా.. సామాజిక కోణం స్పృషిస్తూ ఈ సినిమా క‌థ సాగుతుంద‌ని తెలుస్తుంది. వ‌ర‌స ఫ్లాపుల‌తో డీలాప‌డిన మ‌హేష్ కెరీర్ కు భ‌ర‌త్ అనే నేను కీల‌కంగా మారింది.

User Comments