మే 25న భ‌ర‌త్ అనే నేను విడుద‌ల‌

Last Updated on by

అదేంటి.. ఆల్రెడీ మూడు వారాల కిందే విడుద‌లైన సినిమా మ‌ళ్లీ ఎలా విడుద‌ల‌వుతుంది.. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? అవును నిజ‌మే కానీ భ‌ర‌త్ మాత్రం మే 25నే విడుద‌ల కానుంది. అది మ‌న భాష‌లో కాదు.. త‌మిళ్ లో. మ‌హేష్ బాబుకు తెలుగుతో పాటు త‌మిళ‌నాట కూడా మంచి ఇమేజ్ ఉంది. పైగా స్పైడ‌ర్ సినిమాతో నేరుగా వాళ్ల‌కు ప‌రిచ‌యం అయ్యాడు కూడా. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా ముఖ ప‌రిచ‌యం అయితే అయింది క‌దా. అదే ఇమేజ్ ఇప్పుడు మిగిలిన సినిమాల‌కు ప‌నికొస్తుంది.

ఇప్ప‌టికే భ‌ర‌త్ అనే నేను తెలుగు వ‌ర్షన్ త‌మిళ‌నాట 4 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి తెలుగు సినిమాల్లో కొత్త రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను త‌మిళ వ‌ర్ష‌న్ విడుద‌ల కానుంది. మే 25న విడుద‌ల కానున్న‌ట్లు పోస్ట‌ర్స్ కూడా విడుద‌ల చేసారు. ఇప్ప‌టికే త‌మిళ్ లో మ‌హేష్ అన్ని సినిమాలు అనువాదం అయ్యాయి. ఇప్పుడు మార్కెట్ కాస్త పెరిగిన నేప‌థ్యంలో భ‌ర‌త్ ఫ‌లితం ఎలా ఉండ‌బోతుందో అనేది ఆస‌క్తి రేగుతుంది.

User Comments