మ‌హేష్ బ‌ర్త్ డే ట్రీట్ అదేనా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రీక‌ర‌ణ ష‌ర వేగంగా జ‌రుపుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా లీక‌య్యాయి. వాటితోనే అభిమానులు ఖుషీ అవుతున్నారు. తాజాగా ఈనెల 9న డ‌బుల్ కిక్ ను ఇవ్వ‌డానికి మ‌హేష్ రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆ రోజున మ‌హేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అత‌ని ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని అధికారికంగా రిలీజ్ చేయాల‌ని టీమ్ స‌న్నాహాలు చేస్తోందిట‌.

రెండు మూడు రోజుల్లో దీనిపై యూనిట్ నుంచే అధికారిక వార్త రానుంద‌ని అంటున్నారు. ఇందులో మ‌హేష్ ఆర్మీ అధికారి పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ లుక్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఆన్ సెట్స్ నుంచి లీక‌య్యాయి. ఇవి ఫేక్ కాదు ప‌క్కా అని తెలుస్తోంది. యూనిట్ కూడా దీనిపై స్పందించ‌లేదు. మ‌రి బ‌ర్త్ డేకి ఆర్మీ లుక్ రిలీజ్ చేస్తారా? సాధార‌ణ లుక్ రిలీజ్ చేస్తారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న న‌టిస్తోంది.

Also Read : Mahesh Babu’s Bonding With His Maharshi Director