మ‌హేశ్ కు ఇప్పుడు ఇది అవ‌స‌ర‌మా..?

Last Updated on by

భ‌ర‌త్ అనే నేనుతో కాస్త కుదుట‌ప‌డి త‌ర్వాతి సినిమాతో బిజీగా ఉన్నాడు మ‌హేశ్ బాబు. ఇప్పుడు ఈయ‌న‌కు ఫ్లాప్ అనే మాట వినిపిస్తే చాలు.. హ‌డ‌లిపోతున్నాడు. ఇలాంటి టైమ్ లో కోరిమ‌రీ ఓ ఫ్లాప్ సినిమా మ‌హేశ్ చెంత‌కు వ‌స్తుంది. అదే బ్ర‌హ్మోత్స‌వం. ఈయ‌న కెరీర్ లో ఇంత‌కంటే పెద్ద డిజాస్ట‌ర్ రాదేమో అనేంత‌గా అప్ప‌ట్లో శ్రీ‌కాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని ఇచ్చాడు. ఈ చిత్రం వ‌చ్చి రెండేళ్లైనా ఇప్ప‌టికీ డైరెక్టర్ శ్రీ‌కాంత్ దాన్నుంచి బ‌య‌ట ప‌డలేదనే తెలుస్తుంది. ఇలాంటి టైమ్ లో ఈ చిత్రాన్ని త‌మిళ‌నాట విడుద‌ల చేయ‌బోతున్నారు. స్పైడ‌ర్ ఫ్లాపైనా ఈ చిత్రంతో అక్క‌డి ప్రేక్ష‌కుల‌కు నేరుగా ప‌రిచ‌యం అయ్యాడు మ‌హేశ్ బాబు.

దానికితోడు పోకిరి, ఒక్క‌డు లాంటి సినిమాలు అక్క‌డ రీమేక్ అయి బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాయి. అలా మ‌హేశ్ త‌మిళ‌వాళ్ల‌కు బాగానే తెలుసు. అన్నింటికీ మించి దూకుడు, అత‌డు, సీత‌మ్మ వాకిట్లో లాంటి సినిమాలు అక్క‌డ డ‌బ్ అయ్యాయి. మొన్న భ‌ర‌త్ అనే నేను కూడా త‌మిళ‌నాట విడుద‌లైంది. ఆ న‌మ్మ‌కంతోనే ఇప్పుడు బ్ర‌హ్మోత్స‌వంను డ‌బ్ చేస్తున్నారు. స‌త్య‌రాజ్ తో పాటు స‌మంత‌, కాజ‌ల్ లాంటి వాళ్లు ఉండ‌టంతో ఇదే అక్క‌డ హెల్ప్ అవుతుంద‌ని న‌మ్ముతున్నారు నిర్మాత‌లు. జులైలోనే బ్ర‌హ్మోత్స‌వం త‌మిళ వ‌ర్ష‌న్ విడుద‌ల కానుంది. మ‌రి ఇక్క‌డే చ‌రిత్ర‌లో క‌లిసిపోయిన సినిమా అక్క‌డేం చేస్తుందో చూడాలిక‌..!

User Comments