శాటిలైట్ మ‌హేష్ కెరీర్ బెస్ట్

Last Updated on by

మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 25వ సినిమా మ‌హ‌ర్షి శ‌ర‌వేగంగా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఉగాది కానుక‌గా 2019 ఏప్రిల్ 5న‌ రిలీజ్ కానుంది. ప్ర‌స్తుతం అమెరికా షెడ్యూల్స్ కోసం స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. త్వ‌ర‌లోనే న్యూయార్క్‌లో షూటింగ్ ప్రారంభిస్తారుట‌. అక్క‌డ 40 రోజుల షెడ్యూల్ ఉంటుంద‌ని తెలిసింది. త‌దుప‌రి రామోజీ ఫిలింసిటీలో భారీ విలేజ్ సెట్ నిర్మించి అందులో కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌నున్నారు. ఇటీవ‌లే రిలీజ్ చేసిన టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

మ‌హ‌ర్షి ప్రీరిలీజ్ బిజినెస్‌పైనా భారీ హైప్ నెల‌కొంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా శాటిలైట్ మ‌హేష్ కెరీర్ బెస్ట్ అన్న మాటా వినిపిస్తోంది. ప్ర‌ఖ్యాత ఎంట‌ర్‌టైన్‌మెంట్ చానెల్ జెమినీ మ‌హ‌ర్షి శాటిలైట్ హ‌క్కుల్ని ఛేజిక్కించుకోనుంద‌ని, బెస్ట్ రేట్ ఫిక్స్ చేసింద‌ని తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈ విష‌యాన్ని ధృవీక‌రించాల్సి ఉందింకా. అశ్వ‌నిద‌త్‌, దిల్‌రాజు, పీవీపీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హెగ్డే క‌థానాయిక‌. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర‌ధారి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వ ం వ‌హిస్తున్నారు.

User Comments