మ‌హేష్‌-చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్ మూవీ?

Last Updated on by

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ – మెగావ‌ప‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తే ఎలా ఉంటుంది? ఇప్ప‌టికే చ‌ర‌ణ్ – ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి స‌న్నాహాలు చేస్తున్నారు కాబ‌ట్టి, ఇక మ‌హేష్‌ని క‌లుపుకుని వేరొక మ‌ల్టీస్టార‌ర్ తీస్తే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచ‌న నిన్న‌టిరోజున వంశీ పైడిప‌ల్లికి క‌లిగే ఉంటుంది… ఆ స‌న్నివేశం అలానే ఉంది మ‌రి!

ఐడియా బావుంది. అయితే అందుకు క‌థ రెడీ కావాలి కదా? ఒక‌వేళ మ‌హేష్ తో సినిమా పూర్త‌య్యాక పైడిప‌ల్లి ఏమైనా ప్లాన్ చేస్తారా? అంటే ఏమో! నిన్న‌టిరోజున 40 ఏళ్ల యంగ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి బ‌ర్త్‌డే పార్టీలో ఇలా స్టార్లంతా ఒక‌చోట చేరి సంద‌డి సంద‌డి చేశారు. ఈ పార్టీ వేళ పైడిప‌ల్లి ఇలా మ‌హేష్‌, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి ఫోటో దిగారు. ఆ ఫోటోని ప్ర‌ముఖ పీఆర్‌వో బిఏరాజు షేర్ చేస్తూ ఈ క‌ల‌యిక‌లో మ‌ల్టీస్టార‌ర్ రావాల‌ని ఆకాంక్షించారు.

User Comments