కేజీయ‌ఫ్ ని సెట్ చేస్తోన్న సూప‌ర్ స్టార్!

Last Updated on by

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు `కేజీయ‌ఫ్` డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ను లైన్ లోకి తెస్తున్నాడా? ఈ ద్వ‌యం 2021లో సౌత్ లాంగ్వేజెస్ లోనే భారీ మూవీ ప్లాన్ చేస్తున్నారా? అంటే అవున‌నే వినిపిస్తోంది. `కేజీయ‌ఫ్` హిట్తో ఒక్క‌సారిగా సౌత్ ఇండియ‌న్ సినిమా దృష్టిని ఆక‌ర్షించాడు ప్ర‌శాంత్. కోలార్ బంగారు గ‌నుల నేప‌థ్యంలో బానిస బ్ర‌తుకులు ఎలా ఉండేవో! క‌ళ్ల‌కు క‌ట్టి గ్రేట్ ఫిలిం మేక‌ర్ గా ప్రూవ్ చేసుకున్నాడు.  రాకింగ్ స్టార్  య‌శ్ క‌థానాయుడిగా కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ వ‌న్ ఇటీవ‌ల విడుద‌లై ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. క‌న్న‌డ సిని ప‌రిశ్ర‌మకే కేజీయ‌ఫ్ త‌ల‌మానికంగా నిలిచింది. 250 కోట్ల వ‌సూళ్ల‌తో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లోనే తొలి 200 కోట్ల క్ల‌బ్ చిత్రంగా చ‌రిత్ర సృష్టించింది.

టాలీవుడ్ లో 10 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ప్ర‌స్తుతం కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ -2ని తెర‌కెక్కించే ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. అన్ని ప‌నులు పూర్తిచేసి 2020లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నాడు. అయితే ఇప్పుడీ ద‌ర్శ‌కుడిపై సూప‌ర్ స్టార్ మహేష్  బాబు క‌న్ను ప‌డిందని స‌మాచారం. ఇటీవ‌లే న‌మ్ర‌త పిలుపు మేర‌కు ఆమెను, మ‌హేష్ ని క‌లిసారుట సౌత్ లోనే భారీ బ‌డ్జెట్ సినిమా చేద్ద‌మని, మంచి క‌థ సిద్దం చేయ‌మ‌ని మ‌హేష్ మాటిచ్చాడ‌ని వినిపిస్తోంది. 2021లో ఆ సినిమా ప‌ట్టాలెక్కెలా? అప్ప‌టికి అన్ని ర‌కాలుగా సిద్ద‌మై ఉండ‌మ‌న్నాడుట‌. ఇటీవ‌ల కాలంలో మ‌హేష్  ట్యాలెంట్ ను వెతికి ప‌ట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అర్జున్ రెడ్డి బ్లాక్ బ‌స్ట‌ర్  అవ్వ‌డంతో సందీప్ వంగ‌తో అగ్రిమెంట్ చేసుకున్ సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్ర‌శాంత్ ని  లైన్ లోకి తీసుకురావ‌డంతో ట్యాలెంట్కి  మ‌హేష్ ఎంత పెద్ద పీట వేస్తున్నాడో మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది.

User Comments