మహేష్ హీరోయిన్స్.. మాయలో పడిపోయారు

Last Updated on by

సాధార‌ణంగా అమ్మాయిలు మ‌హేష్ మాయ‌లో ప‌డ‌తారు. అది కామ‌న్. కానీ ఇప్పుడు మ‌హేష్ తో పాటు ఆయన కూతురు మాయ‌లో కూడా ప‌డుతున్నారు. మ‌హేష్ తో న‌టిస్తున్న హీరోయిన్ల‌కు సితార కూడా అల‌వాటు అయిపోతుంది. నిండా ఐదేళ్లు కూడా లేవు.. కానీ అంద‌ర్నీ త‌న‌ చూపుల‌తో మాట‌ల‌తో మాయ చేస్తుంది సితార ఘ‌ట్ట‌మ‌నేని. మ‌హేష్ ముద్దుల కూతురు ఇప్పుడు ఏ ఫంక్ష‌న్ కు వ‌చ్చినా.. షూటింగ్ కు వ‌చ్చినా  సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ అవుతుంది. సితార వ‌చ్చిందంటే చాలు.. అక్క‌డ సంద‌డి క‌నిపిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ల‌తో ఈ చిన్నారికి ఎన‌లేని బంధం ఏర్ప‌డుతుంది. ప్ర‌తీ వేడుక‌లోనూ త‌ల్లి న‌మ్ర‌త కంటే ఎక్కువ‌గా హీరోయిన్ల ఒడిలోనే క‌నిపిస్తుంది సితార‌. వాళ్ల‌తో ఏదో మాట్లాడ‌టం.. క‌లిసిపోవ‌డం చేస్తుంది ఈ చిట్టిత‌ల్లి.Mahesh Heroines Samantha Rakul Kiara Advani Fall in love with Sitaraఇప్పుడు కైరాఅద్వానీ కూడా సితార ఫ్యాన్ అయిపోయింది. తాజాగా భ‌ర‌త్ అనే నేను షూటింగ్ కు సితార కూడా వ‌చ్చింది. అక్క‌డ కైరాతో క‌లిసి ఆడుకుంది ఈ చిన్నారి. కైరా కూడా సితార‌తో ఎంచ‌క్కా క‌లిసిపోయింది. ఇద్ద‌రూ క‌లిసి ఫోటోల‌కు కూడా పోజులిచ్చారు. సితార ఇలా హీరోయిన్లతో క‌లిసిపోవ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో స్పైడ‌ర్ ప్రీ రిలీజ్ వేడుక‌లో కూడా ఉన్నంత సేపు ర‌కుల్ తోనే ఎక్కువ‌గా క‌నిపించింది సితార‌. ఆమెతో ఏదో మాట్లాడుతూనే క‌నిపించింది. పైగా స్టేజ్ పై మ‌హేష్ మాట్లాడుతున్న‌పుడు నాన్న‌ను చూసి విజిల్స్ వేయ‌డ‌మే కాదు.. అల్ల‌రి చేస్తూ చ‌ప్ప‌ట్లు కొడుతూ అంద‌ర్నీ ఆక‌ర్షించింది సితార‌.Mahesh Heroines Samantha Rakul Kiara Advani Fall in love with Sitaraఇక స‌మంత‌తో అయితే సితార‌కు ప్ర‌త్యేక అనుబంధం ఉంది. మ‌హేష్ తో క‌లిసి మూడు సినిమాలు చేసింది కాబ‌ట్టి ఆ అనుబంధం సితార‌తోనూ కొన‌సాగుతుంది. సీత‌మ్మ వాకిట్లో ఆడియోలో బుడిబుడి అడుగుల‌తో స‌మంత‌తో ఆడుకుంది సితార‌. ఇక బ్ర‌హ్మోత్స‌వం ఆడియో వేడుక‌లో పూర్తిగా వీళ్ల ముచ్చ‌ట్లే ఆడియోకు హైలైట్ అయ్యాయి. ఓ వైపు గౌత‌మ్ కృష్ణ ఉన్నా కూడా అన్న‌య్య‌ను త‌న చూపుల‌తో పూర్తిగా డామినేట్ చేస్తుంది ఈ పాప‌. ఈ జోరు చూస్తుంటే త్వ‌ర‌లోనే మ‌హేష్ మాదిరే చిన్న‌త‌నంలోనే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చేలా క‌నిపిస్తుంది. మొత్తానికి ఇప్పుడు సితార పూర్తిగా త‌న చ‌లాకిత‌నంతో అంద‌ర్నీ మాయ చేస్తుంది.Mahesh Heroines Samantha Rakul Kiara Advani Fall in love with Sitara

User Comments