హంస‌న‌డ‌క‌ల న‌గ‌రిలో

Last Updated on by

మ‌హేష్ గత కొంత‌కాలంగా టెన్ష‌న్ ఫ్రీ మైండ్‌తో విహార యాత్ర‌ల‌కు వెళుతున్న సంగ‌తి తెలిసిందే. `భ‌ర‌త్ అనే నేను` అసాధార‌ణ విజ‌యం అత‌డికి ఎంతో రిలీఫ్‌ని ఇచ్చింది. అంత‌కుముందు బ్ర‌హ్హాస్త్రం, స్పైడ‌ర్ చిత్రాల ప్ర‌తికూల ఫ‌లితం మహేష్ మైండ్‌పై ఎంత తీవ్రంగా ప‌డింది? అన్న‌ది .. ఈ స‌న్నివేశం అర్థ‌మ‌య్యేలా చెబుతోంది. ఈ టూర్‌కి వెళ్లే ముందే మ‌హేష్ స్వ‌యంగా అంగీక‌రించి మ‌రీ వెళ్లారు. ఆ రెండు సినిమాలు అభిమానుల ఆశ‌ల్ని నిజం చేయ‌లేదని ఓ స‌క్సెస్ వేడుక‌లో స్వ‌యంగా ఒప్పుకున్నారు. టెన్ష‌న్ ఫ్రీ మైండ్‌తో ఉన్నాన‌ని అన్నారు. అందుకే ఇదిగో త‌మ కుటుంబానికి ఎంతో ఇష్ట‌మైన ప్యారిస్‌లో ఇలా స్వేచ్ఛా విహారం చేస్తూ సెల‌బ్రేష‌న్ మూడ్‌లోకి వెళ్లిపోయారు.

మ‌హేష్‌తో పాటు న‌మ్ర‌త శిరోద్క‌ర్‌, మాష్ట‌ర్ గౌత‌మ్‌, బేబి సితార ప్యారిస్ న‌గ‌రం అంతా చుట్టేస్తున్నారు. అక్క‌డ డిఫ‌రెంట్ ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌లో గ్లింప్స్‌ని ఆస్వాధిస్తున్నారు. ముఖ్యంగా గౌత‌మ్‌కి మ‌హేష్ ఏదో ర‌హ‌స్యం చెబుతున్నట్టే క‌నిపిస్తోంది ఆ ఫోటోలో. కాబోయే భ‌విష్య‌త్ సూప‌ర్‌స్టార్ నువ్వే.. ముందు బాగా చ‌దువుకో అని చెబుతున్నారా? లేక డాడ్ అంత పెద్ద సూప‌ర్‌స్టార్ అవ్వ‌డం వెన‌క సీక్రెట్ చెప్ప‌మ‌ని గౌత‌మ్‌నే స్వ‌యంగా అడ‌గ‌డంతో దానికి ఆన్స‌ర్ చేస్తున్నారా? అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. ఈ టూర్‌లో గౌత‌మ్, సితార వినోదంతో పాటు, చాలా నాలెజ్ సంపాదిస్తార‌న‌డంలో సందేహం లేదు.

User Comments