మ‌హేష్ NYE చీర్స్ ఎక్క‌డ‌?

Last Updated on by

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ కొత్త‌సంవ‌త్స‌రం (NYE) పార్టీ ఎక్క‌డ‌? ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులంతా ఈ ప్ర‌శ్న‌కు స‌రైన స‌మాధానం లేక ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మ‌హేష్ ప్ర‌తిసారీ త‌న‌కు ఇష్ట‌మైన ఒక అంద‌మైన లొకేష‌న్ ఎంపిక చేసుకుని కుటుంబ స‌మేతంగా కొద్దిరోజులు కొత్త సంవ‌త్స‌రాన్ని ఎంజాయ్ చేసి వ‌స్తుంటారు. ఈసారి ఎక్క‌డికి వెళ్లారు? అంటే అందుకు లైవ్ లోనే ఆన్స‌ర్ ఇచ్చాడు మ‌హేష్.

కొంద‌రు స్నేహితుల‌తో క‌లిసి ఉన్న ఫోటోని మ‌హేష్ షేర్ చేశారు. దీనికి ఆస‌క్తిక‌ర‌మైన ట్యాగ్ ని ఇచ్చారు. “చిల్లింగ్ ఎట్ # మిక్స్ విత్ బోయ్స్.. న్యూ హాట్‌స్పాట్ ఇక్క‌డే.. దుబాయ్‌లో #NYE సెల‌బ్రేష‌న్స్ కి రెడీ“ అంటూ ఇన్‌స్టాలో ఫోటోని పోస్ట్ చేశారు. దీంతో మ‌హేష్ కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు ఎక్క‌డో తెలిసిపోయింది. దుబాయ్ లోని ఎగ్జోటిక్ లొకేష‌న్స్ లో మ‌రోసారి కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల్ని ప్లాన్ చేశారు. అత‌డు న‌టించిన మ‌హ‌ర్షి ట్రీట్ నేడు గ్రాండ్ గా ఉండ‌నుంది.

User Comments