మహేష్ తో పూజాహెగ్డే ఎందుకు..?

Last Updated on by

బాలీవుడ్ లో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థ‌లుంటాయి. అందులో ఒక్క సినిమాకు సైన్ చేస్తే వాళ్లు ఒప్పుకోరు. మూడు సినిమాలకు బాండ్ ఉంటుంది. తెలుగులో అలాంటి ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ఏదైనా ఉందా అంటే అది దిల్ రాజు నిర్మాణ‌మే. రాజుగారి గ‌దిలోకి ఒక్క‌సారి అడుగు పెడితే కెరీర్ సెటిల్ అయిన‌ట్లే. అది హీరోలైనా.. హీరోయిన్లైనా. ఇప్పుడు పూజాహెగ్డేను కూడా ఇలాంటి అదృష్ట‌మే వరించింది. ఏడాది కింద వ‌ర‌కు ఈ బ్యూటీని ఐరెన్ లెగ్ అనేవాళ్లు. కానీ వ్ర‌తం చెడ్డా ఫ‌లితం ద‌క్కిన‌ట్లు.. బాలీవుడ్ లో మొహింజ‌దారో డిజాస్ట‌ర్ గా నిలిచినా కూడా పూజాహెగ్డేపై ఇంకా ద‌ర్శ‌క నిర్మాత‌లు న‌మ్మ‌కం పెట్టుకుంటున్నారు.

డిజే ఫ‌లితం ఎలా ఉన్నా.. పూజాహెగ్డే మాత్రం సూప‌ర్ హిట్ అయింది. ఈమె అందాలు బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచాయి. దాంతో వ‌ర‌స‌గా అవ‌కాశాలు వ‌స్తున్నాయిప్పుడు ఈ భామ‌కు .ఇప్ప‌టికే బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో సాక్ష్యం సినిమాలో న‌టిస్తుంది పూజా. ఇది సెట్స్ పై ఉండ‌గానే మ‌హేశ్- వంశీ పైడిప‌ల్లి సినిమాలో కూడా పూజాహెగ్డేనే హీరోయిన్ గా ఫైన‌ల్ చేసారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత‌. ఆల్రెడీ డిజేకు వ‌ర్క్ చేసారు కాబ‌ట్టి మ‌ళ్లీ పూజాహెగ్డేనే తీసుకున్నాడు ఈ నిర్మాత‌. అన్నింటికీ మించి బాలీవుడ్ లో కూడా తెలిసిన అమ్మాయి. అందాల ఆర‌బోత‌లోనూ పెద్ద‌గా ప‌ట్టింపుల్లేవు. దాంతో పూజాను హీరోయిన్ గా తీసుకుంటే హిందీలో కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకే మ‌హేశ్ తో పూజా వ‌ర్క‌వుట్ అయింది.

User Comments