మా ఈవెంట్‌కి మ‌హేష్ నో!

Last Updated on by

మూవీ ఆర్టిస్టుల సంఘం ర‌చ్చ చివ‌రికి కొంప కొల్లేరు చేసేట్టే క‌నిపిస్తోంది. ఆర్టిస్టుల‌కు సొంత బిల్డింగ్ క‌ట్టాల‌ని చేసిన ప్లానంతా గంగ‌పాలైంద‌ని చెబుతున్నారు. 5.50కోట్ల ఫండ్ మా వ‌ద్ద ఉన్నా ఇంకా బిల్డింగుకి పునాది రాయి వేయ‌ని అవినీతి జాతి ఇది! అంటూ విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఆర్టిస్టుల సంఘం అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శుల కొట్లాట పుణ్య‌మా అని అస‌లు లుక‌లుక‌ల‌న్నీ బ‌య‌ట‌కు రావ‌డంతో ఆర్టిస్టుల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. దీనిపై `మా` ఫౌండ‌ర్ మెగాస్టార్ చిరంజీవి సైతం సీరియ‌స్‌గా ఉన్నార‌ని తెలిసింది.

మా సొంత బిల్డింగ్ కోసం సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల‌కు వెళ్లిన చిరంజీవిపైనే బుర‌ద చ‌ల్లారు. దీంతో స‌న్నివేశం ఒక్క‌సారిగా వేడెక్కిపోయింది. చిరు వెళ్లి కోటి ఫండ్ తెస్తే, త‌దుప‌రి మ‌హేష్, ప్ర‌భాస్, నాగార్జున వంటి స్టార్ల‌తోనే భారీ ఈవెంట్ల‌కు ప్లాన్ చేసిన మా వాళ్లకు తాజా వివాదం దిమ్మ‌తిరిగిపోయేలా చేసింద‌ని చెబుతున్నారు. మ‌హేష్‌తో ఈవెంట్ క్యాన్సిల్ చేసేందుకే సీనియ‌ర్ న‌రేష్ ఇంత ర‌చ్చ చేశార‌ని చెబుతున్నారు. శివాజీ ప్రాప‌కం కిట్ట‌ని న‌రేష్ ఇలా చేశారంటూ వివాదం చెల‌రేగింది. ఇక‌పోతే మ‌హేష్‌తో మా అమెరికా ఈవెంట్ కోసం ఇప్ప‌టికీ ప్లాన్‌లో ఉన్నార‌ట‌. అయితే ఈ ఈవెంట్‌కి మ‌హేష్ రావ‌డం స‌సేమిరా కుద‌ర‌దని న‌మ్ర‌త తెగేసి చెప్పారంటూ ఇంగ్లీష్ డెయిలీ డీసీలో క‌థ‌నం వ‌చ్చింది. అయితే ఇది నిజ‌మా.. కాదా? అన్న‌ది తెలియాల్సి ఉందింకా.

User Comments