వాళ్ల‌కు రుణ‌ప‌డిపోయిన పూజాహెగ్డే

Last Updated on by

ఇండ‌స్ట్రీలో ఒక‌రు లాభ‌ప‌డుతున్నారంటే మ‌రొక‌రు న‌ష్ట‌పోతున్నార‌నే అర్థం. ఇప్పుడు పూజాహెగ్డేకు లాభ‌ప‌డే టైమ్ వ‌చ్చింది. కాక‌పోతే ఈమె కోసం ఇంకొంద‌రు ముద్దుగుమ్మ‌లు న‌ష్ట‌పోతున్నారు. తెలుగు ఇండ‌స్ట్రీకి హీరోయిన్ల కొర‌త ఎప్ప‌ట్నుంచో ఉంది. ఎంత‌మంది కొత్త ముద్దుగుమ్మ‌లు వ‌చ్చిన కూడా మ‌ళ్లీ హీరోయిన్ల కొర‌త వ‌చ్చేస్తుంటుంది. ప్ర‌తీ ఐదేళ్ల‌కోసారి ఈ స‌మ‌స్య త‌ప్ప‌నిసరి. కాజ‌ల్, త‌మ‌న్నా, స‌మంత లాంటి వాళ్లంతా ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు. ర‌కుల్ లాంటి ముద్దుగుమ్మ‌ల‌కు కూడా ఇప్పుడు కాలం చెల్లిపోయింది. దాంతో కొత్త నీరు కావాలి. వీళ్ళంద‌రితోనూ స్టార్ హీరోలు ఆడిపారేసారు. ఇప్పుడు కొత్త‌ద‌నం కోసం కోరుకుంటున్న మ‌న హీరోల‌కు పూజాహెగ్డే మాత్ర‌మే ఆప్ష‌న్ గా క‌నిపిస్తుంది. పైగా బాలీవుడ్ లో తెలిసిన మొహం.. అందాల ఆర‌బోత‌కు కూడా ఏ స‌మ‌స్యా ఉండ‌దు.. హైట్ ఉంటుంది.. లేనిది ఒక్క విజ‌యం మాత్ర‌మే. అది మ‌న‌మే ఎందుకు ఇవ్వ‌కూడ‌దు అంటూ ఎవ‌రికి వాళ్లే పూజాను ద‌త్త‌త తీసుకుంటున్నారు.Mahesh NTR Prabhas Next Movie Heroine Pooja Hegdeడిజే త‌ర్వాత తెలుగులో బెల్లంకొండ శ్రీ‌నివాస్ సాక్ష్యం సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుంది పూజా. ఈ చిత్రం సెట్స్ పై ఉండ‌గానే రంగ‌స్థ‌లంలో ఐటం సాంగ్ చేయ‌డానికి  ఒప్పుకుంది. ఈ మ‌ధ్యే మ‌హేష్ బాబు-వంశీ పైడిప‌ల్లి సినిమాలోనూ హీరోయిన్ గా క‌న్ఫ‌ర్మ్ అయింది పూజాహెగ్డే. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలోనూ పూజానే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు ప్ర‌భాస్-రాధాకృష్ణ సినిమాలోనూ ఈమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. ఏక్ దో తీన్ చార్ అంటూ ఒక్కో సినిమాను లెక్క పెట్టుకుంటూ వెళ్లిపోతుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ దూకుడు చూస్తుంటే టాలీవుడ్ నెక్ట్స్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ పూజాహెగ్డే అనేది అర్థ‌మైపోతుంది.Mahesh NTR Prabhas Next Movie Heroine Pooja Hegde

 

User Comments