మ‌హేశ్ ప్లేస్ పై క‌న్నేసిన ప‌వ‌న్..

ఇద్ద‌రూ ఫ్లాపుల్లోనే ఉన్నారు క‌దా.. మ‌రి ఏ ప్లేస్ కోసం ఇప్పుడు మ‌హేశ్ తో ప‌వ‌న్ పోటీ ప‌డుతున్నాడు అనుకుంటున్నారా..? ఇది అభిమానులు కోరుకునే రికార్డ్ కాదు.. ప‌వ‌న్ కూడా భ‌య‌ప‌డే రికార్డే. ఇంత‌కీ ఏంటా రికార్డ్ తెలుసా.. టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ రికార్డ్. అవును.. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాల్లో ఎంత పెద్ద ప్లాపులు వ‌చ్చినా.. నెంబ‌ర్ వ‌న్ మాత్రం స్పైడ‌రే. గ‌తేడాది వ‌చ్చిన ఈ చిత్రం దాదాపు 50 కోట్ల న‌ష్టాలు మిగిల్చింది. ఇంత‌గా ముంచేసిన సినిమా ఈ మ‌ధ్య కాలంలో అయితే ఎప్పుడూ రాలేదు. అంత‌కుముందు బ్ర‌హ్మోత్స‌వం కూడా భారీగా ముంచేసింది కానీ స్పైడ‌ర్ రేంజ్ లో మాత్రం కాదు.

ఇక ఇప్పుడు ప‌వ‌న్ కూడా ఈ రికార్డ్ కోసం పోటీ ప‌డుతున్నాడు. ఈయ‌న న‌టించిన అజ్ఞాత‌వాసి అరాచ‌క‌మైన రికార్డ్ వైపు అడుగులు వేస్తుంది. తెలుగు ఇండ‌స్ట్రీ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ దిశ‌గా వెళ్తుంది అజ్ఞాత‌వాసి. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు రోజుల్లో 50 కోట్లు షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. కానీ ఇది సేఫ్ అవ్వాలంటే 120 కోట్లు రావాలి. ఇప్ప‌టికే తొలిరోజు 40 కోట్లు.. రెండోరోజు 5 కోట్లు.. మూడో రోజు 3.8 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఇక నాలుగో రోజు మ‌రీ దారుణంగా ఉంది ప‌రిస్థితి. దానికితోడు జై సింహా సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వ‌చ్చింది. మాస్ కు ఈ చిత్రం చేరువ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దాంతో అజ్ఞాత‌వాసి ఎంత ముంచేస్తుందో క్లారిటీ కూడా రావ‌ట్లేదు.

User Comments