మ‌హేష్ గెలిచాడు.. ఎన్టీఆర్ ఓడాడు..!

Last Updated on by

ఏ విష‌యంలో..? ఇంత‌కీ ఈ ఇద్ద‌రూ ఎక్క‌డ ఎప్పుడు ఎలా పోటీ ప‌డ్డారు అనుకుంటున్నారా..? ఎన్నిక‌ల్లో ఓడిన అభ్య‌ర్థినే కాదు.. ప్ర‌చారం చేసిన వాళ్ల‌ను కూడా ఒక్కోసారి బ్లేమ్ చేస్తుంటారు. వాళ్ల‌కు స‌పోర్ట్ చేసినందుకు నింద‌లు త‌ప్ప‌వు.. గెలిస్తే పొగ‌డ్త‌లు కూడా వ‌స్తుంటాయి. ఇప్పుడు మ‌హేష్.. ఎన్టీఆర్ ల విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు తమకు కావాల్సిన వాళ్ల సినిమాల‌కు స‌పోర్ట్ చేసారు.. ప్ర‌మోష‌న్ చేసారు. అందులో ఒకరు గెలిచారు.. ఒకరు ఓడిపోయారు. ఎన్టీఆర్ త‌న అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్ న‌టించిన నా నువ్వేకు ప్ర‌మోష‌న్ చేసాడు. ప్రీ రిలీజ్ వేడుక‌కు వ‌చ్చి సినిమా సూప‌ర్ హిట్ కావాల‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పాడు. అవుతుంద‌ని ధీమా కూడా ఇచ్చాడు. మ‌ధ్య‌లో ట్విట్ట‌ర్ లో కూడా ప్ర‌మోట్ చేసాడు.
ఇక ఇదే టైమ్ లో మ‌హేష్ బాబు కూడా త‌న బావ సుధీర్ బాబు సినిమా స‌మ్మోహ‌నంను ప్ర‌మోట్ చేసాడు. ప్రీరిలీజ్ వేడుక‌కు వ‌చ్చి సినిమా కోసం త‌న ఇమేజ్ పంచాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు విడుద‌ల‌య్యాయి. పైగా రెండూ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్సే కావ‌డం విశేషం. ఇందులో జ‌యేంద్ర తెర‌కెక్కించిన క‌ళ్యాణ్ రామ్ నా నువ్వే దారుణ‌మైన టాక్ తెచ్చుకుంది. సినిమా తొలిరోజే ఫ్లాప్ అని తేలిపోయింది. ఇదే స‌మ‌యంలో సుధీర్ బాబు హీరోగా ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ తెర‌కెక్కించిన స‌మ్మోహ‌నంకు సూప‌ర్ టాక్ వ‌చ్చింది. ఈ చిత్రం చాలా బాగుంద‌ని టాక్ వ‌చ్చేసింది. చూస్తుంటే ఈ వారం బాక్సాఫీస్ ను పూర్తిగా సుధీర్ బాబు ద‌త్త‌త తీసుకునేలా క‌నిపిస్తున్నాడు. అంటే ఇక్క‌డ ఎన్టీఆర్ ఓడి.. మ‌హేష్ గెలిచాడ‌న్న‌మాట‌. నిజానికి ఈ రెండు ఫ‌లితాల‌తో ఈ హీరోల‌కు సంబంధం లేక‌పోయినా వెన‌కుండి న‌డిపించింది మాత్రం వీరే క‌దా..! అలా ఇప్పుడు ఎన్టీఆర్ పై మ‌హేష్ విజ‌యం సాధించాడ‌న్న‌మాట‌.

User Comments