వావ్.. అరబిక్ లో మహేష్ బాబు..!

 

టాలీవుడ్ సినిమా ఇప్పుడు కొత్తపుంతలు తొక్కుతుంది. బాహుబలి ఇచ్చిన ధైర్యమో ఏంటో మిగతా సినిమాలు కూడా భాషతో సంబంధం లేకుండా బోర్డర్స్ దాటేస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ముందున్నాడనే అనాలి. ఈ మేరకు తన లేటెస్ట్ మూవీ ‘స్పైడర్’ తో మహేష్ సరికొత్త రికార్డులనే సెట్ చేస్తున్నాడు. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించి.. తమిళంలో స్వయంగా డబ్బింగ్ చెప్పి ఆకట్టుకున్న మహేష్.. మలయాళ డబ్బింగ్ వెర్షన్ ను కూడా ఒకేసారి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పుడేమో మహేష్ తన స్పైడర్ ను మరో భాషలోకి కూడా తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తుండటం ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అప్పుడెప్పుడో  మహేష్ సూపర్ హిట్ సినిమా అతడు పోలిష్ భాషలో పోలాండ్ దేశంలో రిలీజై పెద్ద హిట్ అయినట్లు.. ఇప్పుడు కూడా ఓ క్రేజీ ఫీట్ ను రెడీ చేయిస్తున్నారట. అదేంటంటే, స్పైడర్ మేకర్స్ ఇప్పుడు ఈ సినిమాను అరబిక్ భాషలోకి కూడా డబ్బింగ్ చేయిస్తున్నారట. ఎలాగూ ఈ సినిమాలో కంటెంట్ యూనివర్సల్ గా వర్కౌట్ అయ్యేలా ఉండటం.. సినిమా కూడా యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెకక్కడంతో.. గల్ఫ్ దేశాల్లో తెలుగు, హిందీ వెర్షన్ లతో పాటుగా అరబిక్ వెర్షన్ కూడా రిలీజ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారట. మొత్తంగా సెప్టెంబర్ 27న స్పైడర్ సినిమాను అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఇప్పుడు అరబిక్ భాష కూడా కలిసినట్లు.. ముందుముందు స్పైడర్ ఇంకెన్ని భాషల్లోకి వెళుతుందో చూడాలి.