స‌ర్టిఫికేట్లు ఇస్తున్న మ‌హేష్

Last Updated on by

మ‌హేష్ ఏంటి.. స‌ర్టిఫికేట్లు ఇవ్వ‌డం ఏంటి.. పిచ్చి గానీ ప‌ట్టిందా అనుకుంటున్నారా..? న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉన్నా ఇప్పుడు ఇదే నిజం. మ‌న మ‌హేష్ నిజంగానే ఇప్పుడు స‌ర్టిఫికేట్లు ఇస్తున్నాడు. అది కూడా బాగున్న సినిమాల‌కు మాత్ర‌మే. అవును.. ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన చాలా సినిమాలు చూసి ట్విట్ట‌ర్ లో రివ్యూలు ఇస్తున్నాడు సూప‌ర్ స్టార్. ఇప్ప‌టికే రంగ‌స్థ‌లంను ఓ రేంజ్ లో పొగిడాడు సూప‌ర్ స్టార్. రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న అద్భుతంగా ఉంద‌ని.. సుకుమార్ టేకింగ్ కేక అని స‌ర్టిఫికేట్ ఇచ్చాడు మ‌హేష్ బాబు. ఇక ఈ మ‌ధ్యే విడుద‌లైన స‌మ్మోహ‌నం కూడా అద్భుతమ‌ని పొగిడాడు మ‌హేష్ అంతేకాదు.. సుధీర్ బాబు.. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌.. అదితిరావ్ హైద్రీల‌ను ఆకాశానికి ఎత్తేసాడు. ఇక ఇప్పుడు అభిమ‌న్యుడు వంతు.

విశాల్ న‌టించిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ్ లో సూప‌ర్ హిట్ అయింది. ఇన్నాళ్ల‌కు ఈ చిత్రం చూసిన సూప‌ర్ స్టార్.. ట్విట్ట‌ర్ లో సూప‌ర్ అని స‌ర్టిఫికేట్ ఇచ్చేసాడు. డిజిట‌ల్ మోసాల‌పై తీసిన ఈ చిత్రం అద్భుతంగా ఉందంటూ.. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలంటూ కోరాడు మ‌హేష్. మ‌రీ ముఖ్యంగా ద‌ర్శ‌కుడు మిత్ర‌న్ వ‌ర్క్ త‌న‌కు బాగా న‌చ్చింద‌ని చెప్పాడు మ‌హేష్ బాబు. ఇక విశాల్ ను కూడా ఆకాశానికి ఎత్తేసాడు సూప‌ర్ స్టార్. ఇలా ఈ మ‌ధ్య కాలంలో మంచి సినిమాలు వ‌చ్చిన‌పుడు బిజీగా ఉన్నా కూడా టైమ్ తీసుకుని మ‌రీ చూస్తున్నాడు మ‌హేష్. చూడ‌ట‌మే కాకుండా ఆ సినిమాల‌ను పొగిడే కార్య‌క్ర‌మం కూడా పెట్టుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న డెహ్రాడూన్ లో వంశీ పైడిప‌ల్లి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

User Comments