మ‌హేష్ ఫ్యాన్స్ కి స‌ర్ ప్రైజ్

Last updated on September 11th, 2019 at 12:25 pm

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇటీవల మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో మహేశ్‌ పాత్రను పరిచయం చేసిన చిత్ర బృందం. తాజాగా స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశానికి సేవ చేస్తూ త్యాగానికి మారుపేరైన భారత సైనికులకు ఘన నివాళిగా ఓ పాటతో కూడిన వీడియోను అభిమానులతో పంచుకుంది.

‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ సాగిన ఈ వీడియోలో 1971 ఇండో-పాక్‌ వార్‌, సియాచిన్‌ వివాదం, కార్గిల్‌ యుద్ధం, 2016 సర్జికల్‌ స్ట్రైక్స్‌ చిత్రాలను చూపించారు. ఆ దృశ్యాల‌న్నీ రోమాంచితంగా ఉన్నాయి. దీన్ని బ‌ట్టి దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో తెర‌కెక్కుతోందని మ‌రోసారి క్లారిటీ వ‌చ్చింది. కామెడీ పంథాకు దూరంగా అనీల్ స‌రికొత్త క‌థ‌తో మ‌హేష్ ను వినూత్నంగా చూపిస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకం, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ భాగ‌స్వామ్యంలో నిర్మిస్తున్నాయి.