టాప్ స్టోరి: `మ‌హేష్ – చ‌ర‌ణ్` బ్యాటిల్‌?

Last Updated on by

ఇన్నాళ్లు మ‌హేష్‌- ప‌వ‌న్ మ‌ధ్య పోటాపోటీ ఉండేది. క‌లెక్ష‌న్ల ప‌రంగా.. ఛ‌రిష్మా వైజ్‌.. ఆ ఇద్ద‌రూ ప‌రిశ్ర‌మ‌ను నంబ‌ర్ -1 స్థానంలో ఏలారు. ఒక‌రి సినిమాతో ఇంకొక‌రి సినిమా పోటీప‌డి వ‌సూళ్లు సాధించ‌డం చూస్తే, ఇటు మెగాభిమానులు, అటు ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు ఎంతో ఖుషీ అయిపోయేవారు. అయితే ప‌వ‌న్ ఆక‌స్మికంగా జ‌న‌సేన పార్టీ పెట్టి, రాజ‌కీయాల‌వైపు వెళ్లిపోయారు కాబ‌ట్టి ఇప్పుడు ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. అయితే ప‌వ‌న్ వార‌సుడిగా ఆ స్థానాన్ని భ‌ర్తీ చేసేది ఎవ‌రు? ఆ స్థాయి స్టార్‌డ‌మ్‌ని భుజాన మోసే సత్తా ఎవ‌రికి ఉంది? అంటూ ఒక‌టే ముచ్చ‌ట సాగుతోంది. అయితే ఇన్నాళ్లు ఆ ప్లేస్ బ్లాంక్‌గానే ఉండిపోయింది కానీ, ఫ‌లానా హీరో భ‌ర్తీ చేస్తాడు అన్న న‌మ్మ‌కం లేకుండా పోయింది.

అయితే రంగ‌స్థ‌లంతో బాబాయ్ ప్లేస్‌ని చ‌ర‌ణ్ తీసుకున్నాడు. ఇక మ‌హేష్‌కి పోటీ ఇవ్వ‌బోయేది అత‌డేన‌న్న న‌మ్మ‌కాన్ని ఇచ్చాడు. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో నంబ‌ర్ -1 స్థానాన్ని చ‌ర‌ణ్ ఆక్ర‌మించాడు. ఇప్పుడు మ‌హేష్ న‌టించిన `భ‌ర‌త్ అనే నేను` ఆ స్థానాన్ని ఛేజ్ చేయాల్సి వ‌స్తోంది. ఓవ‌ర్సీస్‌లో ఇన్ని రోజులు మ‌హేష్ హ‌వా సాగింది. ప‌వ‌న్-మ‌హేష్ నువ్వా? నేనా? అంటూ పోటీప‌డ్డారు. కానీ ఈసారి చ‌ర‌ణ్ కూడా రేసులోకి వ‌చ్చాడు.రంగ‌స్థ‌లం ఫుల్‌ర‌న్‌లో 125కోట్ల షేర్ వ‌సూలు చేస్తే, భ‌ర‌త్ అనే నేను 100 కోట్ల షేర్ సాధించింద‌ని ట్రేడ్ చెబుతోంది. అమెరికాలోనూ ఇరు సినిమాల మ‌ధ్య పోటాపోటీ న‌డుస్తోంది. మ‌హేష్, చ‌ర‌ణ్ మ‌ధ్య రేసింగ్ షురూ అయ్యింది. ఇక ప్ర‌భాస్‌, బ‌న్ని రేసులో ఉన్నా మెగాభిమానుల ఓటు చ‌ర‌ణ్‌కే ఉంటుంది కాబ‌ట్టి అందుకు త‌గ్గ హ‌వా తెలుగు రాష్ట్రాలు స‌హా ఓవ‌ర్సీస్‌లోనూ కొన‌సాగుతుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. టేక్ ది ఛార్జ్ చ‌ర‌ణ్! అంటూ అభిమానులే ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఇక కేవ‌లం మాస్ సినిమాలే కాకుండా ప్ర‌యోగాల‌కు సైతం వెన‌కాడ‌ని చర‌ణ్ మునుముందు మ‌రిన్ని ఆస‌క్తిక‌ర చిత్రాల‌తో త‌న రేంజు పెంచుకుంటాడ‌న్న న‌మ్మ‌కం అంద‌రిలోనూ క‌లిగింది. ఇటు ట్రేడ్‌లోనూ ప్ర‌స్తుతం చెర్రీ పున‌ర్‌వైభ‌వంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. డాడ్ చిరంజీవి లెగ‌సీని కాపాడే సిస‌లైన వార‌సుడు చర‌ణ్‌…. ఇక అత‌డికి ఎదురే లేద‌న్న టాక్ న‌డుస్తోంది. ఇక మ‌హేష్ – చ‌ర‌ణ్ బ్యాటిల్ షురూ అయిన‌ట్టేన‌న్న టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

User Comments