Last Updated on by
బాలీవుడ్ – టాలీవుడ్ టై అప్‌లో సినిమాలు తీయడమే కాదు, వాణిజ్య ప్రకటనలు తెరకెక్కడం నేటి ట్రెండ్. ప్రఖ్యాత బ్రాండ్లు ఈ తరహా డీల్ కుదుర్చుకుంటున్నాయి. ఇక థమ్సప్ యాడ్ అంటేనే మహేష్ గుర్తుకొస్తారు. ఇటీవలి కాలంలో కొత్త ప్రకటనలో మహేష్ ఎనర్జీ గుర్తుకొస్తుంది. థమ్సప్ అంటేనే సాహసం అనే తీరుగా ఈ ప్రకటనను ఎంతో క్యూరియస్‌గా రూపొందించారు. ఇదే ప్రకటనలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కనిపిస్తాడు. దక్షిణాదిన మహేష్ బ్రాండ్ అంబాసిడర్ అయితే, ఉత్తరాదిన రణ్వీర్ బ్రాండ్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
అదంతా అటుంచితే ఇప్పటికే బోర్ కొట్టిన పాత యాడ్ స్థానంలో కొత్త ప్రకటన రూపొందించేందుకు థమ్సప్ టీమ్ రెడీ అవుతోంది. మహేష్ – రణవీర్ మరోసారి ఈ ప్రకటన కోసం జోడీగా బరిలో దిగుతున్నారు. ఈసారి మునుపటి కంటే ఎనర్జిటిక్‌గా .. ఎగ్జయిట్మెంట్ చూపించే ప్రకటన రూపొందిస్తారట. ఇకపై బుల్లితెరపై ఈ కొత్త యాడ్ సరికొత్తగా దర్శనమిస్తుందని తెలుస్తోంది. అన్నట్టు వాణిజ్య ప్రకటనల ద్వారా మహేష్, రణవీర్‌ల వార్షికాదాయం ఓ రేంజులో ఉందని సర్వేలు చెబుతున్నాయి.
User Comments