మ‌హేష్ మ‌ళ్లీ `స్పై` అవ‌తారం

స్పై సినిమాలకి హాలీవుడ్ పెట్టింది పేరు. త‌ర్వాత ఆ క‌థ‌లు మ‌న ద‌గ్గ‌రికీ వ‌చ్చేశాయి. ఈమ‌ధ్య వాటి జోరు మ‌రింత పెరిగింది. స్పై క‌థ‌ల్లో అస‌లు సిస‌లు గూఢ‌చారులుగా హీరోలు త‌మ ప్ర‌తాపం చూపుతున్నారు. మ‌హేష్ కూడా `స్పైడ‌ర్‌`లో ఆ త‌ర‌హా పాత్ర‌నే చేశాడు. మురుగ‌దాస్ సినిమాలో మ‌హేష్ స్పై అన‌గానే అంచ‌నాలు ఆకాశాన్ని తాకాయి. కానీ అది వ‌ర్క‌వుట్ కాలేదు. ఈసారి మాత్రం ఆయ‌న రియ‌ల్ స్పైగా అద‌ర‌గొట్ట‌బోతున్నాడు.

అందుకోసం ప‌క్కాగా ఏర్పాట్లు చేస్తున్నాడు వంశీ పైడిప‌ల్లి. ఇది కూడా సోష‌ల్ ఎలిమెంట్స్‌తో కూడుకున్న క‌థే అనీ, మ‌హేష్ ఇదివ‌ర‌కు చేసిన సినిమాల‌కీ పూర్తి భిన్నంగా, హీరోయిజం పాళ్లు మ‌రింత బ‌లంగా ఉండ‌బోతున్నాయ‌ని స‌మాచారం. ఈ చిత్రం కోసం మ‌హేష్ శారీర‌కంగా కూడా మ‌రింత ధృఢంగా మార‌బోతున్నాడ‌ట‌. అందుకోసం ఆయ‌న అమెరికాకి వెళ్లాడు. అక్క‌డ హాలీడేస్‌ని ఎంజాయ్ చేస్తూనే, ఫిట్‌నెస్‌కి సంబంధించి చిన్న‌పాటి ట్రైనింగ్ కూడా తీసుకోబోతున్న‌ట్టు తెలిసింది. మ‌హేష్ అమెరికాలో నెల‌ల‌పాటు ఉంటార‌ని అంటున్నారు కానీ, అన్ని రోజులు ఆయ‌న అక్క‌డ ఉండ‌డం లేదు. రెండు వారాల్లోనే తిరిగి రాబోతున్నాడ‌ట‌. ఆ వెంట‌నే కొత్త సినిమా కోసం రంగంలోకి దిగ‌బోతున్నారు.