గెలుపు ఉత్సాహాంలో మ‌హేష్‌ టూర్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఇటీవ‌లే మ‌హర్షితో మ‌రో భారీ స‌క్సెస్ అందుకున్నాడు. కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను న‌మోదు చేసాడు. మూడుసార్లు కాల‌రెగ‌రేసి మ‌రీ ఆ విష‌యాన్ని వెల్ల‌డించాడు. మ‌హ‌ర్షి విజ‌యంతో రెట్టించిన ఉత్సాహంలో ఉన్నాడు. తాజాగా మ‌హేష్ మ‌రోసారి కుటుంబంతో విహార యాత్ర‌కు వెళ్తున్నాడు. మ‌రో మ‌ధుర‌మైన విహార యాత్ర‌కు వెళ్తున్నాం. ఈసారి ఇదెంతో ప్ర‌త్యేక‌మైన‌ది అని ట్వీట్ చేసి తెలిపారు. ప్ర‌స్తుతం సగౌత‌మ్చ పితార పాప‌కు స్కూల్ హాలీడేస్ కూడా ట్రిప్ కు క‌లిసొచ్చిన‌ట్లు తెలుస్తోంది. మ‌హ‌ర్షి షూటింగ్ పూర్త‌వ్వ‌గానే మ‌హేష్ ఫ్యామిలీతో పారిస్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

మ‌రి సారి ఏదేశం టూర్ వెళ్తున్నారో? మ‌హ‌ష్ చెప్ప‌క‌పోయినా…లీకులందుతాయి గా! ఈ టూర్ అనంత‌రం విదేశాల నుంచి తిరిగొచ్చాక మ‌హేష్ అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. జూన్ లో ఆ సినిమా లాంచ్ అయ్యే అవ‌కాశాలున్నాయి. ఈలోపు ఎండ‌లు కూడా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. అలాగే గీత‌గోవిందం ద‌ర్శ‌కుడు ప‌రశురాంతోనూ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అయితే దీనిపై అధికారికంగా వెల్ల‌డించాల్సి ఉంది.