ఎన్టీఆర్, మ‌హేష్ నో మూడ్

Last Updated on by

ఇదివ‌ర‌కూ తెలంగాణ ఎన్నికల్లో తేదేపా త‌ర‌పున‌ కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని బరిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆమె సోదరులైన సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ రామ్ ప్రచారానికి దూరంగానే ఉండిపోవ‌డంపైనా చ‌ర్చ సాగింది. ప్ర‌స్తుత ఏపీ ఎన్నిక‌ల్లోనూ ఆ ఇద్ద‌రూ ప్ర‌చారానికి రాక‌పోవ‌డంపై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అలాగే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో తెలుగుదేశం తరపున గల్లా జయదేవ్ పోటీచేస్తున్నారు. ఆయన బావమరిది సూప‌ర్ స్టార్ మహేష్ ఎన్నిక ప్రచారానికి వ‌స్తార‌ని భావిస్తే ఆయ‌న దూరంగానే ఉన్నారు.

మ‌హేష్ పెద‌నాన్న, నిర్మాత‌ ఆది శేష‌గిరిరావు వైకాపాకు రాజీనామా ఇచ్చి, తెలుగుదేశం పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న కోసం మ‌హేష్ వెళ్ల‌లేదు. జూ.ఎన్టీఆర్, మ‌హేష్ వంటి స్టార్ల‌ను తేదేపా క్యాంపెయినింగ్ కి ఉప‌యోగించుకోవాల‌ని భావించిన చంద్ర‌బాబుకు వ్యూహం ఫ‌లించ‌లేద‌న్న మాటా వినిపిస్తోంది. మ‌రోవైపు మ‌హేష్, ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ లాంటి స్టార్లు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఎల‌క్ష‌న్, రాజ‌కీయాలు మాకొద్దు.. సినిమాలే ముద్దు అన్న‌ట్టే ఉంది వీళ్ల వాల‌కం.

Also Read: Young Tiger Attends Maharshi’s Party


Related Posts