తొలిసారి అక్కడ కాలేజ్, యూనివర్సిటీలో మహేష్!

Maheshs BAN shot Nadwa college Lucknow university

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘స్పైడర్’ గా అలరించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తనవంతు వర్క్ ను దాదాపుగా ఫినిష్ చేసేయడంతో.. మరోవైపు కొరటాల శివ డైరెక్షన్లో తన కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ ను కూడా మహేష్ లైన్ లో పెట్టేశాడు. ఈసారి స్పైడర్ లా ఆలస్యం చేయకూడదనే ఉద్దేశ్యంతో మహేష్ గ్యాప్ లేకుండా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న ‘భరత్ అనే నేను’ ఇప్పుడు మరో షెడ్యూల్ కోసం లక్నో వెళ్లేందుకు రెడీ అవుతుందని తెలియడం ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది. ఎందుకంటే, మహేష్ కెరీర్ లోనే తొలిసారిగా లక్నో లో షూటింగ్ జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రెండు వారాల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ ఈ నెల 10 నుంచే మొదలవుతుందని అంటున్నారు.
ఇదే విశేషం అనుకుంటే, ఇప్పుడు ఈ షెడ్యూల్ లో లక్నో లోని జహాంగీరాబాద్ ప్యాలెస్, నాధ్వా కాలేజ్, లక్నో యూనివర్సిటీ లో షూటింగ్ జరపనున్నారని తెలియడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా అక్కడి కాలేజ్, యూనివర్సిటీలలో మహేష్ పొలిటికల్ లీడర్ అవడానికి ముందు ఎడ్యుకేషన్ కు సంబంధించిన పోర్షన్ ను.. అలాగే అక్కడ లీడర్ గా మారడానికి దారితీసిన పరిస్థితులకు సంబంధించిన సీన్స్ ను షూట్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. మొత్తంగా ఈ సినిమాలో భరత్ అనే పొలిటికల్ లీడర్ గా మహేష్ కనిపిస్తుండటంతో.. ముందుగా లక్నోలో మహేష్ విద్యార్థి దశను చిత్రీకరిస్తారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని, మహేష్ ఇప్పుడు కెరీర్ లో తొలిసారి లక్నోలో షూటింగ్ చేయడమే విశేషం అనుకుంటే.. అక్కడ ప్రముఖ కాలేజ్, యూనివర్సిటీ ల బాట పట్టడం నిజంగా విశేషమనే అనాలి.