భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ నిజమేనా..!

Last Updated on by

ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాల‌కు పాజిటివ్ టాక్ రావ‌డ‌మే ఆల‌స్యం.. రికార్డులు బ‌ద్ధ‌లైపోతాయి అనుకుంటారు. కానీ అన్నిసార్లు అలా కుద‌ర‌దు. కొన్ని సార్లు టాక్ బాగున్నా కూడా సేఫ్ కావ‌డానికే చాలా తంటాలు ప‌డాల్సి వ‌స్తుంది. కావాలంటే ఇప్పుడు సాక్ష్యంగా భ‌ర‌త్ అనే నేను సినిమాను చూపించొచ్చు. ఈ చిత్రం వ‌చ్చి మూడు వారాలు అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా సేఫ్ జోన్ కు రాలేదు. మూడో వారంలో కూడా నామ‌మాత్ర‌పు వ‌సూళ్లు సాధించింది ఈ చిత్రం. ఇప్ప‌టి వ‌ర‌కు 92 కోట్ల షేర్ వ‌సూలు చేసింది భ‌ర‌త్ అనే నేను. నిజానికి ఇవి చాలా మంచి వ‌సూళ్లు.

ఏడాది కింద అయితే ఇది రికార్డ్ వ‌సూళ్లే. కానీ ఇప్పుడు కాదు.. ఈ చిత్రాన్ని అమ్మిందే 100 కోట్ల‌కు. అంటే ఇంకా 8 కోట్లు బాకీ ఉన్నాడు ఈ ముఖ్య‌మంత్రి. అవి వ‌స్తే కానీ హిట్ అని పూర్తిగా పిలిపించుకోలేని ప‌రిస్థితి. ఓవ‌ర్సీస్ తో పాటు అన్ని చోట్లా ఇప్ప‌టికే బ‌య‌ట‌ప‌డిపోయాడు కానీ తెలుగు రాష్ట్రాల్లోనే భ‌ర‌త్ ప‌రిస్థితి ఊహించినంత‌గా లేదు. ఎంత బ్లాక్ బ‌స్ట‌ర్ అని పోస్ట‌ర్లు వేసుకున్నా కూడా ఇప్ప‌టికీ ఇక్క‌డే 8 కోట్లు రావాలి. 72 కోట్ల‌కు సినిమా అమ్మితే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చింది 64 కోట్లే. మిగిలిన 8 కోట్లు వ‌స్తే కానీ సినిమా సేఫ్ కాదు. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అవి రావ‌డం క‌లే. మొత్తానికి.. భ‌ర‌త్ చివ‌రివ‌ర‌కు త‌న ప్ర‌యాణం ఎక్క‌డ ముగిస్తాడో..?

User Comments