`మ‌జిలీ` రిలీజ్ ముందే స‌క్సెస్‌

Last Updated on by

అక్కినేని నాగ‌చైత‌న్య – స‌మంత జంట‌గా న‌టిస్తున్న సినిమా మ‌జిలి. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ప్ర‌స్తుతం ఫిలిం ట్రేడ్ లో హాట్ టాపిక్. ఈ సినిమా నాగ‌చైత‌న్య కెరీర్ బెస్ట్ బిజినెస్ చేసింద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే రిలీజైన పాట‌ల‌కు స్పంద‌న బావుంది. మూడు పాట‌లు వేటిక‌వే యూనిక్ అన్న టాక్ వినిపించింది. దీంతో మ‌జిలీ థియేట్రిక‌ల్ రైట‌ర్స్ స‌హా శాటిలైట్, డిజిట‌ల్, డ‌బ్బింగ్ రైట్స్ కి చ‌క్క‌ని గిరాకీ ఏర్ప‌డింద‌ట‌.

మ‌జిలీ శాటిలైట్ హ‌క్కుల‌కు జెమిని టీవీ రూ.5కోట్ల‌కు చెల్లిస్తోంది. డిజిట‌ల్ రైట్స్ ని అమెజాన్ 3.5 కోట్ల‌కు చేజిక్కించుకుంది. హిందీ డ‌బ్బింగ్ రైట్స్ రూ.4కోట్ల‌కు వెళ్లాయ‌ని తెలుస్తోంది. అలాగే థియేట్రిక‌ల్ రైట్స్ అమ్మ‌కాల ద్వారా నిర్మాత‌ల‌కు 15కోట్ల మేర టేబుల్ ప్రాఫిట్ వ‌చ్చింద‌న్న స‌మాచారం అందుతోంది. తెలుగు రాష్ట్రాలు స‌హా ఓవ‌ర్సీస్ లో బిజినెస్ చ‌క్క‌గా కుదిరింద‌ట‌. నిన్ను కోరి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తెర‌కెక్కించిన శివ నిర్వాణ చై- సామ్ జోడీ కోసం చ‌క్క‌ని క‌థాంశాన్ని ఎంచుకున్నారు. మ‌ధ్య త‌ర‌గ‌తి క‌ష్టాలు, ఈతిబాధ‌ల నేప‌థ్యంలో చ‌క్క‌ని ప్రేమ‌క‌థ‌తో ఉత్కంఠ క‌లిగించే ఎమోష‌న్స్ తో మ‌జిలీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. చైత‌న్య – స‌మంత జోడీ పెళ్లి త‌ర్వాత న‌టిస్తున్న సినిమాగా కొంత‌వ‌ర‌కూ క్రేజు నెల‌కొంది. ఏప్రిల్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. రిలీజ్ ముందే ఈ సినిమా బిజినెస్ ప‌రంగా బిగ్ స‌క్సెస్ అన‌డంలో సందేహం లేదు. చైతూ కెరీర్ బెస్ట్ బిజినెస్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి రిజ‌ల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

Also Read:Majili Turns Out To Be A Lottery

User Comments