మజిలీ షాకింగ్ కలెక్షన్స్

అక్కినేని నాగచైతన్య కెరీర్ బెస్ట్ హిట్ అందుకోబోతున్నారా? అంటే అవుననే సమాచారం. చైతన్య .. సమంత జంటగా శివనిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ నిర్మించిన మజిలీ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం .. ఈ సినిమా తొలి వీకెండ్ మూడురోజుల్లోనే 17 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ చెబుతోంది. డే 1 పాజిటివ్ టాక్ తోనే మజిలీ విజయంపై టీమ్ ధీమాను వ్యక్తం చేసింది. నిన్నటిరోజున హైదరాబాద్ లోనూ విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఏమాయ చేశావే తర్వాత మళ్లీ చై .. సామ్ జంటకు మెమరబుల్ హిట్ ఇదని ఆనందం వ్యక్తమవుతోంది.

పెళ్లి తర్వాత చైతూ సమంత జోడీ తొలి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారని అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రేడ్ విశ్లేషణ ప్రకారం తొలి వీకెండ్ షేర్ వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం 5.26కోట్లు, సీడెడ్ 1.96కోట్లు, యుఏ 1.93కోట్లు, తూ.గో జిల్లా 0.86కోట్లు, గుంటూరు 0.65కోట్లు, కృష్ణ 1కోటి, నెల్లూరు 0.37కోట్లు వసూలైంది. ఏపీ.. తెలంగాణ కలుపుకుని 13.27 కోట్ల షేర్ వసూలైందని గణాంకాలు చెబుతున్నాయి. ఇతర భారతదేశంలో 1.27కోట్లు, ఓవర్సీస్ నుంచి 2.35కోట్లు వసూలైందని ట్రేడ్ చెబుతోంది. ఓవరాల్ గా 17.37 కోట్ల షేర్ ని మజిలీ వసూలు చేసింది. చైతూ కెరీర్ బెస్ట్ హిట్ గా ఈ సినిమాని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.