మ‌జిలీ ప్రీరిలీజ్ బిజినెస్

అక్కినేని నాగ‌చైత‌న్య – స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం మజిలీ. శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు. షైన్ క్రియేష‌న్స్ సంస్థ నిర్మించింది. రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటించారు. గోపీ సుందర్‌ బాణీలు ఇప్ప‌టికే శ్రోత‌ల్ని ఆక‌ట్టుకున్నాయి. ఏప్రిల్‌ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా నేటి ఉద‌యం స‌మంత & ఫ్యామిలీ తిరుమ‌లేశుని స‌న్నిధానంలో మొక్కు తీర్చుకున్న సంగ‌తి తెలిసిందే.

చైతూ న‌టించిన గ‌త చిత్రం స‌వ్య‌సాచి బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌డంలో త‌డ‌బ‌డింది. అలాగే సామ్ యుట‌ర్న్ సైతం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నా.. బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైంది. అందుకే ఈసారి ఎట్టిప‌రిస్థితుల్లో హిట్ కొట్టి తీరాల‌న్న పంతంతో ప‌ని చేశారు. మ‌జిలీ ఎంత వ‌సూలు చేస్తే హిట్ట‌వుతుంది? అంటే.. ఈ సినిమా 25కోట్ల షేర్ వ‌సూలు చేస్తే హిట్ట‌యిన‌ట్టేన‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. మ‌జిలీ ఓవ‌రాల్ గా 21కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగించింది. వివ‌రాల్లోకి వెళితే… నైజాం – 6కోట్లు, సీడెడ్ -2.50 కోట్లు, తూ.గో జిల్లా -1.44కోట్లు, కృష్ణ‌-1.28 కోట్లు, గుంటూరు-162కోట్లు, ప‌.గో జిల్లా- 1.12కోట్లు, నెల్లూరు-0.70కోట్లు, యుఏ-1.98 కోట్లు, ఏపీ-తెలంగాణ‌- 16.64కోట్లు, ఇత‌ర భార‌త‌దేశం- 1.50కోట్లు బిజినెస్ సాగించింది. ఓవ‌రాల్ గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 21.14కోట్ల బిజినెస్ సాగించింది.