ప్రేమికుల రోజున `మ‌జిలీ` ట్విస్టు

Last Updated on by

ప్రేమికుల రోజు కానుక‌గా తెలుగు రాష్ట్రాల్లో ఓ రెండు క్రేజీ సినిమాలు రిలీజ్ ల‌కు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రియా వారియ‌ర్ – రోష‌న్ జంట‌గా న‌టించిన ల‌వ‌ర్స్ డే, కార్తీ- ర‌కుల్ జంట‌గా న‌టించిన దేవ్ చిత్రాలు రిలీజ్ ల‌కు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు ర‌ణ‌వీర్ – ఆలియా జంట‌గా న‌టించిన‌ బాలీవుడ్ సినిమా గ‌ల్లీ బోయ్ చిత్రాలు రిలీజ్ బ‌రిలోకి దిగుతున్నాయి. అదే రోజు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్ ని రిలీజ్ చేస్తున్నామ‌ని వ‌ర్మ తెలిపారు. సేమ్ డే మ‌జిలీ టీమ్ బ‌రిలో దిగుతోంది. ఆ రోజు చై – సామ్ జంట నుంచి కొత్త ట్విస్టు ఉంటుందిట‌. అదేంటి? అంటే..

అక్కినేని నాగ‌చైత‌న్య – స‌మంత జంట‌గా న‌టిస్తున్న మ‌జిలీ ప్ర‌చారంలో వేగం పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వ ం వ‌హిస్తున్న ఈ సినిమా పై అంత‌కంత‌కు అంచ‌నాలు పెరుగుతున్నాయి. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం.. భార్య భ‌ర్త‌ల ఈగోల నేప‌థ్య ంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వైజాగ్ – వాల్టేర్ నేప‌థ్య ం ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు చెబుతున్నారు. ఇప్ప‌టికే మిజిలీ ప్రీలుక్, ఫ‌స్ట్ లుక్ ప్ర‌తిదీ సినిమాపై ఆస‌క్తి రేకెత్తించాయి. తాజాగా మ‌రో కొత్త లుక్ ని టీమ్ రిలీజ్ చేసింది. ఫిబ్ర‌వ‌రి 14న ప్రేమికుల రోజు కానుక‌గా తొలి టీజ‌ర్ ని రిలీజ్ చేయ‌నున్నారు. ఆ మేర‌కు అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. స‌మంత‌- చైతూ పెళ్లి త‌ర్వాత న‌టిస్తున్న తొలి చిత్ర‌మిది. షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

User Comments