వెధవలకెప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారు!

Last Updated on by

నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న చిత్రం `మజిలీ`. పెళ్లికి ముందు ప్రేమ పక్షులైన ఈ జంట పెళ్లి తరువాత కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది. `నిన్నుకోరి` ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ప్రేమ ఎక్కడ వుంటుందో పేయిన్ అక్కడే వుంటుంది (దేర్ ఈజ్ లవ్..దేర్ ఈజ్ పేయిన్) అనే ట్యాగ్ లైన్‌తో హార్ట్ టచింగ్ కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడు. `మజిలీ` టీజర్‌ని ప్రేమికుల రోజున చిత్ర బృందం విడుదల చేసింది. తొలి సినిమా `నిన్నుకోరి`లో ఓ విఫల ప్రేమికుడి త్యాగాన్ని చూపించి ఆకట్టుకున్న శివ నిర్వాణ `మజిలీ` చిత్రంతో ప్రేమ, భార్యా భర్తల అనురాగం వాళ్లిద్దరి ప్రేమలో వుండే పెయిన్‌ని, ఫ్రస్టేషన్‌ని చూపించినట్లు టీజర్లో అర్థమవుతోంది.

క్రికెట్ ప్లేయర్‌గా నాగచైతన్య సరికొత్త పాత్రలో కనిపించారు. అయితే ఆ క్రికెట్ కోసమే తను ప్రేమించిన యువతిని పోగొట్టుకున్న యువకుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. అలాంటి వ్యక్తి జీవితంలోకి వచ్చిన ఓ యువతి పడే అంతర్మధనం నేపథ్యంలో ఆద్యంతం హార్ట్ టచింగ్‌గా సినిమాని తెరకెక్కించినట్ల తెలుస్తోంది. నాగచైతన్య ప్రేమించిన యువతిగా కొత్త నటి దివ్యాంశ కౌశిక్ కనిపించనుంది. ప్రేమ విఫలమైన ఫ్రస్టేషన్లో వున్న నాగచైతన్య జీవితంలోకి భార్యగా సమంత ఎంటర్ కావడం…నా రూమ్ వరకు రాగవేమో కానీ నా గుండెల్లోకి మాత్రం రాలేవని నాగచైతన్య సమంతతో చెప్పడం…బ్రాగ్రౌండ్‌లో వెధవలకెప్పుడూ మంచి పెళ్లాలు దొరుకుతారని నువ్వే ప్రూవ్ చూశావ్` అంటూ తండ్రి పాత్రలో పోసాని కృష్ణ మురళి చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. వీటన్నింటిని బట్టి చూస్తే ఫీల్ గుడ్ సినిమాగా చై, సామ్‌ల ఖాతాలో `మజిలీ` చేరుతుందని స్పష్టమౌతోంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు.

User Comments