రెండ్రోజుల్లో మజిలీ వసూళ్లు

Last Updated on by

Last updated on April 8th, 2019 at 02:17 pm

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య తన కెరీర్ బెస్ట్ హిట్ అందుకోబోతున్నాడా? మజిలీ అతడికి మరో కీలకమైన మలుపు కాబోతోందా? అంటే అవుననే తాజా సమాచారం. ఈ సినిమాలో సమంత, చైతన్య నటనకు క్రిటిక్స్ నుంచి యునానిమస్ గా ప్రశంసలు దక్కాయి. మజిలీ చైతన్య కెరీర్ బెస్ట్ అవుతుందని ప్రశంసలు దక్కాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కేవలం రెండే రెండు రోజుల్లో 9.51 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. ఓవర్సీస్ నుంచి బాక్సాఫీస్ పరంగా చక్కని రిపోర్ట్ అందుతోంది.
మజిలీ చిత్రాన్ని ఎంతో ఎమోషనల్ గా తీర్చిదిద్దిన దర్శకుడు శివ నిర్వాణకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మజిలీ ఏరియా వైజ్ రెండ్రోజుల వసూళ్ల వివరాల్ని పరిశీలిస్తే.. నైజాం: 3.67 కోట్లు, సీడెడ్ 1.37 కోట్లు, యుఏ 1.39కోట్లు, తూ.గో 0.61కోట్లు, ప.గో జిల్లా 0.49కోట్లు, కృష్ణ 0.72కోట్లు, గుంటూరు 0.98కోట్లు, నెల్లూరు 0.28కోట్లు వసూలైంది. ఓవరాల్ గా రెండ్రోజుల్లో ఏపీ, నైజాం కలుపుకుని 9.51కోట్లు వసూలైందని తెలుస్తోంది. ఈ సినిమా నాగచైతన్య , సమంత జంటకు స్వీట్ మెమరీగా నిలుస్తుందని, ఆ ఇద్దరి కెరీర్ కి బెస్ట్ హిట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

Also Watch : Majili Box Office Report

User Comments