పిల్ల రచ్చ మాములుగా లేదండి

Last Updated on by

అన్నీ ఫిక్స్ అయ్యే ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ట్లుంది మాళ‌విక శ‌ర్మ‌. తొలి సినిమాతోనే ఇక్క‌డ ఎలా ఉండాలో నేర్చేసుకుంది. చిన్న పిల్ల‌లా క‌నిపిస్తుంది కానీ చాలా ఫాస్ట్ గా అన్నీ నేర్చుకుంటుంది మాళ‌విక‌. నేల‌టికెట్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మాళ‌విక చేస్తోన్న గ్లామ‌ర్ షోకు కెమెరాలు సైతం హీట్ ఎక్కి పోతున్నాయి. అంత‌గా రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ‌. నిండా 20 ఏళ్లు కూడా లేకుండానే హీరోయిన్ అయిపోయింది ఈ భామ‌.

malavika sharma looks too hot at nela ticket Events

యాడ్స్ తో బానే ఫేమ‌స్ అయిన మాళ‌విక‌ను ఆడిష‌న్ కూడా లేకుండానే నేరుగా సినిమాల్లోకి తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ‌. ఇక ర‌వితేజ అయితే కేవ‌లం ఈ భామ క‌ళ్లు చూసి ప‌డిపోయాడు. ఈ విష‌యం చెప్పింది కూడా ఆయ‌నే. వాళ్ల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే క‌ళ్ళ‌తోనే కాదు.. ఒళ్లుతో కూడా మాయ చేస్తుంది ఇప్పుడు మాళ‌విక‌. తొలి సినిమా విడుద‌ల‌కు ముందే ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక నేల‌టికెట్ టాక్ తో సంబంధం లేకుండా మాళవిక ఇండస్ట్రీలో రచ్చ చేసేలా ఉంది.

malavika sharma looks too hot at nela ticket Events

User Comments