నేల టిక్కెట్ పోరీ త‌ళుకుబెళుకులు!

Last Updated on by

టాలీవుడ్‌లోకి ఉవ్వెత్తున దూసుకొచ్చింది మాళ‌విక శ‌ర్మ‌. ఈ భామ వ‌స్తూనే ఓ రేంజులో హ‌వా చాటుతోంది. ఇక్క‌డ న‌వ‌త‌రం హీరోల‌తో మొద‌లు పెట్టి నెమ్మ‌దిగా స్టార్ హీరోల్ని చుట్టేస్తోంది. నాని, సుధీర్‌బాబు, నారా రోహిత్ వీళ్లంద‌రితో పాటు మాస్ రాజా లాంటి టాప్ హీరోనే బుట్ట‌లో వేసింది. రవితేజ స‌ర‌స‌న‌ కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్న `నేల టిక్కెట్‌` చిత్రంలో క్రేజీగా ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా ఆన్ లొకేష‌న్ ఉండ‌గానే నాగార్జున‌- నాని మ‌ల్టీస్టార‌ర్‌లో నాని స‌ర‌స‌న మ‌రో బంప‌రాఫ‌ర్ ప‌ట్టేసింది. ఇవి రెండే కాదు.. ప్ర‌స్తుతం ఇత‌ర స్టార్ హీరోల చూపు అమ్మ‌డిపై ప్ర‌స‌రించింద‌ని తెలుస్తోంది.

ఇక మాళ‌విక ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ గా నేల టిక్కెట్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. ఈ ట్రైల‌ర్‌లో అమ్మ‌డి గ్లింప్స్ ఓ రేంజులో కుర్ర‌కారును ట‌చ్ చేశాయి. ఇక నేల టిక్కెట్ వేడుక ఆద్య ంతం క‌ళ్ల‌న్నీ మాళ‌విక‌పైనే. ఆడిటోరియంతో పాటు, చుట్టూ జ‌నం మాళ‌విక అంద‌చందాల్నే వీక్షించ‌డం హైలైట్. ఇక ఈ భామ ఇప్పుడున్న న‌వ‌త‌రం నాయిక‌లంద‌రికీ పోటీనే అన‌డంలో సంద‌హం లేదు. కీర్తి, అనుప‌మ‌, సాయి ప‌ల్ల‌వి అంద‌రికీ ఎర్తింగ్ పెడుతుంద‌న‌డంలో సందేహ‌మే లేదు.

User Comments