`మళ్లీ మళ్లీ చూశా` ప్ర‌కృతి ప్రేమ‌క‌థ‌

Last Updated on by

అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమవుతొన్న చిత్రం `మళ్లీ మళ్లీ చూశా`. క్రిషి క్రియేషన్స్ పతాకంపై సాయిదేవ రామన్ దర్శకత్వంలో కొణిదెన కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరొయిన్ లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ను నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు. సురేష్ బాబు మాట్లాడుతూ.. `మళ్లీ మళ్లీ చూశా` టీజర్ చాలా ఫ్రెష్ గా ఉంది. కంటెంట్ యూత్ కు బాగా చెరువయ్యేలా ఉంది. హీరో అనురాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. టీమ్ కు ఆల్ ది బెస్ట్ అన్నారు. దర్శకుడు సాయిదేవ రామన్ .. సురేష్ బాబు గారికి ధన్యవాదాలు. ప్రకృతి సృష్టించిన అందమైన ప్రేమకథ చిత్రం మా `మళ్ళీ మళ్ళీ చూశా` సినిమా అన్నారు.

నిర్మాత కోటేశ్వరరావు కొణిదెన మాట్లాడుతూ.. “మా సినిమా కంటెంట్ నచ్చి టీజర్ విడుదల చెసిన సురేష్ బాబు గారికి ధన్యవాదాలు‌. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సినిమా మేం అనుకున్న దానికంటే బాగా వచ్చింది. త్వరలోనే ఆడియో రిలీజ్ ని చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం“ అన్నారు. హీరో అనురాగ్ మాట్లాడుతూ.. “కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో హీరోగా పరిచయమవు తున్నందుకు ఆనందంగా వుందన్నారు. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రేమకథ“ ఇదన్నారు. ఈటివి ప్రభాకర్, టి.ఎన్.ఆర్, మిర్చి కిరణ్, అప్పాజీ, బ్యాంక్ శీను, మధుమణి, పావని,ప్రభావతి, జయలక్ష్మి, రీతూ చౌదరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్,ఛాయాగ్రాహకుడు : సతీష్ ముత్యాల.

User Comments