తెర‌వెన‌కా శృంగారం కోరారు

Last Updated on by

ఆన్ ది స్క్రీన్ క్యారెక్ట‌ర్‌నే తెర‌వెనుక కూడా ప్ర‌ద‌ర్శిస్తార‌ని అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే. తెర‌పై అందాల్ని ఆరాంగా ఆవిష్క‌రించినంత మాత్రాన బ‌య‌ట కూడా వేశ్య‌లా చూస్తానంటే కుద‌ర‌దు. స‌రిగ్గా ఇదే విష‌యాన్ని కాస్త అటూ ఇటూగా చెప్పి కోపం ప్ర‌ద‌ర్శించింది మ‌ల్లికా శ‌రావ‌త్‌.

వెండితెర‌పై ద‌శాబ్ధం పైగానే త‌న‌వైన అంద‌చందాల‌తో శృంగార నాయిక‌గా వెలిగిపోయిన మ‌ల్లికా శ‌రావ‌త్ తాను శృంగారం ఒల‌క‌బోసింది కేవ‌లం తెర‌పై మాత్రమే. అది చూసి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, హీరోలు తెర‌వెన‌కా త‌న‌ను శృంగార‌, కామ వాంఛ‌ల స్త్రీ అనే అనుకున్నార‌ట‌. అంతేకాదు .. కొంద‌రు త‌న‌ను ఫేవ‌ర్ చేయ‌మ‌ని కోరేవార‌ని వాపోయింది. అందుకే తాను కెరీర్‌లో చాలా త‌క్కువ సినిమాలు చేశాన‌ని మ‌ల్లిక టాప్ సీక్రెట్‌ని లీక్ చేసింది. ఆఫ్ ద స్క్రీన్ ఫేవ‌ర్స్ చేయలేక 14 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో హిందీ సినిమాలు వ‌దులుకున్నాన‌ని ఇటీవ‌లే ఒకానొక ఇంట‌ర్వ్యూలో షాకింగ్ ట్రూత్స్‌ని వెల్ల‌గ‌క్కింది. బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్ప‌టికే బోలెడంత ర‌చ్చ సాగింది. ప‌లు సంద‌ర్భాల్లో ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, హీరోల పేర్లు ప్ర‌ముఖంగా వినిపించాయి. ఇక‌పోతే మ‌ల్లిక లాంటి బాధితులు అక్క‌డ అడుగ‌డుగునా క‌నిపిస్తారు. కానీ మ‌ల్లిక‌లా బ‌య‌టి ప్ర‌పంచానికి ఈ దురాఘ‌తాన్ని చెప్పేవాళ్లు చాలా త‌క్కువ‌. కంగ‌న‌, పీసీ లాంటి వాళ్లు రేర్‌. మ‌రి ఇక‌ముందు ఇంకెంతమంది మ‌ల్లిక‌లు ఈ తీరుగా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలి.

User Comments