ట్రైల‌ర్: మ‌మాంగం ఎపిక్ వార్ డ్రామా

మలయాళ మెగాస్టార్ మ‌మ్ముటి న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `మమాంగం`. సంజీవ్ పిళ్లై- ప‌ద్మాకుమార్ సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  కావ్య ఫిల్మ్ కంపెనీ నిర్మించ‌గా.. తెలుగులో గీతా డిస్ట్రిబ్యూట‌ర్స్ సంస్థ‌ రిలీజ్ చేస్తోంది. 14వ శ‌తాబ్ధం నుంచి 18వ శ‌తాబ్ధం మ‌ధ్య కేర‌ళ వ‌ల్లువ‌నాడు అనే ప్రాంతంలో మ‌మాంగం అనే పండుగ‌కు ఒక ప్ర‌త్యేక ప్రాశ‌స్త్యం ఉంది. అక్క‌డ యుద్ధ వీరులు ఎంతో గొప్ప‌వారు. గొప్ప హిస్టారిక‌ల్ ఎపిసోడ్స్ ఉన్న స్థానం అది. అంతా మ‌ర్చిపోయిన త‌రుణంలో మ‌మ్ముట్టి- ప‌ద్మాకుమార్ బృందం అక్క‌డ జ‌రిగిన య‌థార్థ‌ఘ‌ట‌న‌ల ఆధారంగా మమాంగం అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇదో వారియ‌ర్ ఎపిక్ డ్రామా. మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర పోషించారు.

లేటెస్టుగా మ‌మాంగం తెలుగు ట్రైల‌ర్ రిలీజైంది. మ‌మ్ముట్టి ఓ పొడ‌వాటి క‌ర‌వాలంతో యూనిక్ ఫైటింగ్ స్టైల్ తో ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకున్నారు. ఇందులో మ‌హిళ‌లు.. పిల్ల‌లు యుద్ధ విద్య‌లు నేర్చుకుని ప్ర‌తిభా పాఠ‌వం చూపించ‌డం కొత్త‌గా ఉంది. ఈ చిత్రంలో రావ‌ణుడు ఎవ‌రు? అస‌లు మ‌మ్ముట్టి పాత్ర ప్ర‌త్యేక‌త ఏమిటి? అన్న‌ది తెర‌పైనే చూడాలి. భారీ హిస్టారిక‌ల్ ఎపిక్ వార్ డ్రామాతో వ‌స్తున్న ఈ చిత్రాన్ని మ‌ల‌యాళంతో పాటు త‌మిళం-తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో గీతా సంస్థ రిలీజ్ చేస్తుండ‌డంతో ఆస‌క్తి పెరిగింది.  ప్రాచీ తెహ్లాన్ హీరోయిన్ గా న‌టించ‌గా, సీనియ‌ర్ న‌టుడు ఉన్ని ముకుంద‌న్ కీల‌క పాత్ర పోషించారు.