మ‌మ్ముట్టి `యాత్ర` ఫైన‌ల్ రిజ‌ల్ట్?

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాద‌యాత్ర‌ ఆధారంగా తెరకెక్కిన `యాత్ర‌`. ఫైన‌ల్ రిజ‌ల్ట్ తేలిపోయింది. ఈ సినిమా స‌క్సెసైందా లేదా? అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న వేళ క‌లెక్ష‌న్స్ ప‌రంగా స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఇటీవ‌ల క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు డిజాస్ట‌ర్ అయిన నేప‌థ్యంలో యాత్ర స‌న్నివేశం కాస్త బెట‌ర్ అన్న చ‌ర్చా తాజా లెక్క‌లు తేల్చాయి. యాత్ర చిత్రానికి 13 కోట్ల మేర బిజినెస్ సాగితే .. దాదాపు 9 కోట్ల మేర షేర్ వ‌సూలైంది. అంటే నాలుగు కోట్ల వ‌ర‌కూ పంపిణీ వ‌ర్గాల‌కు పంచ్ ప‌డింద‌న్న‌మాట‌. యాత్ర వ‌సూళ్ల లెక్క‌లు ఇలా ఉన్నాయి.

ఏపీ నైజాంలో యాత్ర 6.61 కోట్లు వ‌సూలు చేసింది. ఓవ‌రాల్ గా వ‌ర‌ల్డ్ వైడ్ 8.81 కోట్లు వ‌సూలైంది. నైజాం -1.55, సీడెడ్-1.61, నెల్లూరు-0.41, కృష్ణా-0.61, గుంటూరు-1.12, వైజాగ్- 0.57, తూ.గో జిల్లా- 0.32, ప‌.గో జిల్లా- 0.42 కోట్ల‌ షేర్ వ‌సూలైంది. కేరళ -0.70, అమెరికా- 0.95, ఇత‌ర చోట్ల నుంచి 0.55 ల‌క్ష‌లు వ‌సూలైంది. ఇక‌పోతే పంపిణీదారుల‌కు కొంత మేర పంచ్ ప‌డినా.. శాటిలైట్, డ‌బ్బింగ్ రైట్స్ అంటూ అవ‌న్నీ అద‌నంగా నిర్మాత‌కు ఆదాయ మార్గాలేన‌న్న ముచ్చ‌ట ట్రేడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. మ‌మ్ముట్టి క‌థానాయ‌కుడిగా మ‌హి.వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌శిదేవిరెడ్డి, విజ‌య్ చిల్లా ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించారు. ఈ సినిమాకి వైయ‌స్ జ‌గ‌న్, విజ‌య‌మ్మ నుంచి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసిన సంగ‌తి తెలిసిందే.