ఏఎన్నార్ జ్ఞాప‌కాలు మంట‌ల్లో బూడిద‌..

అన్న‌పూర్ణ స్టూడియోస్ లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 13 సాయంత్రం ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాదం జ‌రిగిన‌పుడు నాగార్జున కూడా అన్న‌పూర్ణ స్టూడియోలోనే ఉన్నారు. ఈ ప్ర‌మాదానికి కార‌ణం షార్ట్ స‌ర్క్యూట్ అంటున్నాడు నాగార్జున‌. అక్క‌డ కాలిపోయిన సెట్ మ‌హేశ్ బాబు భ‌ర‌త్ అనే నేను కోసం వేసింది అనుకున్నారంతా. కానీ అది కాదు.

అన్న‌పూర్ణ‌లో కాలిపోయింది మ‌నం సినిమా కోసం వేసిన సెట్. అవును.. అక్కినేని చివ‌రి జ్ఞాప‌కంగా ఇప్ప‌టికీ ఆ సెట్ ను అలాగే ఉంచేసాడు నాగార్జున‌. కానీ ఇప్పుడు అది కాలిపోయింది. మంట‌ల్లో ప‌డి క్ష‌ణాల్లో బూడిదైపోయింది. 2 కోట్ల వ‌ర‌కు ఆస్తిన‌ష్టం జ‌రిగింద‌ని చెప్పాడు నాగార్జున‌. అయితే ఆస్తి కంటే ముందు అందులో నాన్న‌గారి జ్ఞాప‌కాలు ఉన్నాయ‌ని బాధ‌పడ్డాడు నాగ్. ప్ర‌మాదం జ‌రిగిన కొన్ని క్ష‌ణాల్లోనే తాను అక్క‌డికి చేరుకున్నాన‌ని.. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా త్వ‌ర‌గానే ఈ ఘ‌ట‌న‌పై స్పందించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపాడు నాగార్జున‌. ఎలాంటి ప్రాణన‌ష్టం జ‌ర‌గ‌లేదు. అయితే తాను ప్రేమ‌గా చూసుకుంటున్న తండ్రి జ్ఞాప‌కాలు కాలిపోవ‌డంతో కంట‌నీరు పెట్టుకున్నారు నాగార్జున‌.