మనసుకి నచ్చింది సెన్సార్ పూర్తి

Last Updated on by

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్-ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్-పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “మనసుకు నచ్చింది”. సందీప్ కిషన్-అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయమవుతుంది. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకొని “యు/ఎ” సర్టిఫికెట్అం దుకొంది. ఫిబ్రవరి 16న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నద్ధమవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. “విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్రెష్ & రోమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా “మనసుకి నచ్చింది” తెరకెక్కింది. సెన్సార్ పూర్తయ్యింది, యు/ఎ సర్టిఫికేషన్ సొంతం చేసుకుంది. రాధన్ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలుస్తుంది. ప్రేక్షకులకి ఒక మంచి సినిమా చూశామనే భావన కలిగించే చిత్రం “మనసుకు నచ్చింది”” అన్నారు.
సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిధా చౌదరి, ప్రియదర్శి, పునర్నవి భూపాలం, నాజర్, అరుణ్ ఆదిత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాధన్, ఎడిటర్: సతీష్ సూర్య, కళ: హరివర్మ, సినిమాటోగ్రఫీ: రవి యాదవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: పి.కిరణ్-సంజయ్ స్వరూప్, రచన-దర్శకత్వం: మంజుల ఘట్టమనేని.

User Comments