మంచు మ‌నోజ్‌.. `అహం బ్ర‌హ్మాస్మి`

Manchu manoj aham Brahmasmi

త్వ‌ర‌లోనే సినిమా క‌బురు వినిపిస్తాన‌ని ఎప్ప‌ట్నుంచో చెబుతున్నాడు మంచు మ‌నోజ్‌. రోజూ ఆయ‌న్ని ఆ విష‌యం గురించి ట్విట్ట‌ర్‌లో అడుగుతూనే ఉంటారు అభిమానులు. ఇదిగో అదిగో అంటూ చెప్పుకొస్తున్న ఆయ‌న ఎట్ట‌కేల‌కి కొత్త సినిమా వివ‌రాల్ని ప్ర‌క‌టించాడు. మార్చి 6 నుంచి మొద‌ల‌య్యే ఆ సినిమాని కొద్దిసేప‌టి క్రిత‌మే ప్ర‌క‌టించారు. `అహం బ్రహ్మాస్మి` పేరుతో ఆ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. శ్రీకాంత్‌.ఎన్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఈ చిత్రంతో మంచు మ‌నోజ్ నిర్మాత‌గా కూడా మారుతున్నారు. ఎమ్‌.ఎమ్‌.ఆర్ట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించిన ఆయ‌న త‌న త‌ల్లి నిర్మలాదేవితో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంచు మ‌నోజ్ సినిమాల‌కి దూర‌మై చాలా కాల‌మైంది. పెళ్లి త‌ర్వాత ఆయ‌న తన వ్య‌క్తిగ‌త జీవితంపైనే దృష్టిపెట్టారు. కానీ ఆ పెళ్లి బంధం ఇటీవ‌లే ముగిసిపోయింది. ప్ర‌ణ‌తితో కొంత‌కాలం కింద‌టే విడిపోయిన ఆయ‌న మ‌ళ్లీ సినిమాల‌పై దృష్టిపెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.