మంచు మనోజ్ కెరీర్ ఇక ఇంతేనా?

మంచు మ‌నోజ్‌కు ఏమైంది. ఎందుకు సినిమాలు చేయ‌డం లేదు?. సినీ కెరీర్ ఇక అంతేనా?కెరీర్ తో పాటు వైవాహిక జీవితంలో ఇబ్బందులు త‌లెత్తాయా?… సినీ వ‌ర్గాల్లో గ‌త కొంత కాలంగా సాగుతున్న చ‌ర్చ ఇది. మంచు మ‌నోజ్ నుంచి సినిమా వ‌చ్చి దాదాపు రెండేళ్ల‌వుతోంది. సినిమాల‌కు గుడ్ బై చెప్పేస్తున్నానంటూ సోష‌ల్ మీడియా ద్వారా మంచు మ‌నోజ్ కొన్ని నెల‌ల క్రితం ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించాడు. ఉద‌యం పోస్ట్ చేసిన ట్వీట్‌ని అనూహ్యంగా గంట‌ల వ్య‌వ‌ధిలోనే తొల‌గించ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. తండ్రి మోహ‌న్‌బాబు మంద‌లించ‌డంతో ఉద‌యం చేసిన ట్వీట్‌ని మంచు మ‌నోజ్ తొల‌గించాడ‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది.

ఇది గ‌డిచి నెల‌లు గ‌డుస్తున్నా మంచు మ‌నోజ్ మ‌రో సినిమాకు సైన్ చేయ‌లేదు. అత‌ని సినిమా ఊసే లేదు. దీనికి తోడు మంచు మ‌నోజ్ ఇటీవ‌ల జ‌రిగిన కార్య‌క్ర‌మాల్లో క‌నిపించ‌డం లేదు. ఆయ‌న భార్య కూడా క‌నిపించ‌క‌పోవ‌డంతో ఇద్ద‌రు క‌లిసే వుంటున్నారా? లేక విడిపోయారా అని ఫిల్మ్ న‌గ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సామాజిక కార్య‌క్ర‌మాల పేరుతో మంచు మ‌నోజ్ ఎక్కువ శాతం చిత్తూరు జిల్లాలోనే కుటుంబ స‌భ్యుల‌కు దూరంగా గ‌డుపుతుండ‌టం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. అయితే భార్యా భ‌ర్త‌లు క‌లిసి క‌నిపించ‌నంత మాత్రాన విడిపోయార‌ని ఎలా ప్ర‌చారం చేస్తార‌ని మంచు ఫ్యామిలీ అభిమానులు ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల స‌మయంలో శ్రీ‌విద్యానికేత‌న్ విద్యార్థుల ఫీజ్ రీఎంబ‌ర్స్‌మెంట్ విష‌యంలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం తాత్సారం చేస్తోంద‌ని, త‌న‌పై కావాల‌నే క‌క్ష సాధిస్తోంద‌ని మోహ‌న్‌బాబు ధ‌ర్మాకు దిగి నానా హంగామా సృష్టించారు. ఆ స‌మ‌యంలో తండ్రికి బాస‌ట‌గా మంచు మ‌నోజ్ మీడియా ముందుకు వ‌చ్చాడు. ఆ త‌రువాత అత‌ను ఎక్క‌డికి వెళ్లిపోయాడో ఏం చేస్తున్నాడో ఎవ‌రికీ తెలియ‌దు. వైఎస్ జ‌గ‌న్ అనూహ్య విజ‌యాన్ని సాధించిన సంద‌ర్భంగా మంచు విష్ణు మాత్ర‌మే క‌నిపించాడు కానీ మ‌నోజ్ మీడియా మందుకు రాలేదు. దీంతో మ‌నోజ్ కు ఏమైంది? ఎందుకు సినిమాలు చేయ‌డం లేద‌ని ఆయ‌న అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. ఇప్ప‌టికైనా మ‌నోజ్ త‌న కోసం ఎదురుచూస్తున్న నిర్మాత‌ల కోరిక మేర‌కు సినిమాలు ఇప్ప‌టికైనా ప్రారంభించాల‌ని ఆశిద్దాం.